Center instructions to Indian students in America

Central Govt : అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కేంద్రం సూచనలు

Central Govt : భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమెరికాలోని భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని శుక్రవారం సూచించింది. ఇటీవల ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సూచన జారీ చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంది. వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణాధికారానికి సంబంధించినవని, వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేసింది. విదేశీ పౌరులు భారతదేశానికి వచ్చినప్పుడు, వారు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని మనం ఆశిస్తాం.

Advertisements
 అమెరికాలోని భారతీయ విద్యార్థులకు కేంద్రం

ట్రంప్ హెచ్చరికలు

అదేవిధంగా భారతీయ పౌరులు విదేశాలలో ఉన్నప్పుడు వారు కూడా అక్కడి చట్టాలు, నిబంధనలను పాటించాలి అని విదేశాంగ శాఖ కార్యదర్శి రణధీర్‌ జైస్వాల్ స్పష్టంచేశారు. ఇటీవల కాలేజీలు, స్కూళ్లు, యూనివర్సిటీలను ఉద్దేశంచి ట్రంప్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ నిరసనలను అనుమతించే కాలేజీ, స్కూల్‌ లేదా యూనివర్సిటీలకు అన్ని ఫెడరల్‌ నిధులు నిలిపివేస్తా. ఆందోళనకారులను జైలుకు లేదా వారి స్వదేశానికి పంపించడం జరుగుతుంది. అమెరికా విద్యార్థులైతే శాశ్వత బహిష్కరణ లేదా కేసు తీవ్రతను బట్టి అరెస్టు ఉంటుంది. ఇందులో ఎటువంటి దాపరికం లేదు అని పేర్కొన్నారు.

హమాస్‌కు మద్దతుగా ప్రచారం

కాగా, వాషింగ్టన్‌ డీసీలోని జార్జ్‌టౌన్‌ యూనివర్సిటీలో పోస్ట్‌ డాక్టోరల్‌గా ఉన్న బదర్‌ఖాన్‌ సురి విశ్వవిద్యాలయంలో హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నాడని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అతడి వీసాను రద్దు చేయడమే కాక..గత సోమవారం వర్జీనియాలోని నివాసం నుంచి అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే తర్వాత అతడికి తాత్కాలిక ఉపశమనం లభించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు అతడి బహిష్కరణకు వీల్లేదని వర్జీనియా కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.

Related Posts
HCU: హెచ్‌సీయూ భూముల వివాదం.. పలువురు నాయకులపై కేసు నమోదు
HCU: హెచ్‌సీయూ భూముల వివాదం.. పలువురు నాయకులపై కేసు నమోదు

హైదరాబాద్ హెచ్‌సీయూ భూములపై తప్పుడు ప్రచారం ఘటనపై కేసులు హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) భూములను గురించి సోషల్ మీడియా ప్రచారం ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతోంది. Read more

మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ ఇంటిపై దాడి
Attack on Manipur CM Biren

మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని సీఎం ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై శనివారం దుండగులు దాడికి ప్రయత్నించారు. దీంతో సీఎం ఇంటి బయట ఉన్న దుండగులపై Read more

భారతదేశంలో విమానయాన రంగంలో మార్పులు అవసరం: రాఘవ్ చద్దా
raghavchadha

రాజ్యసభ ఎంపీ, రాఘవ్ చద్దా, "విమాన టిక్కెట్లు ఇప్పుడు చాలా ఖరీదైనవి మరియు సాధారణ ప్రజలకు విమాన ప్రయాణం ఒక కలగా మారింది. విమానాశ్రయాలలో రద్దీని బస్ Read more

హైదరాబాదీ టాలెంట్‌కు ఫిదా అయినా ఆనంద్ మహీంద్రా
sudhakar cars

ఆనంద్ మహీంద్రా హైదరాబాదీ టాలెంట్ గురించి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సుధాకర్ అనే వ్యక్తి వివిధ ఆకారాలలో కార్లను తయారు చేయడం మరియు ఒక మ్యూజియం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×