Center approves Kedarnath ropeway

కేదార్‌నాథ్ రోప్‌వేకు కేంద్రం ఆమోదం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కేదార్ నాథ్ వేళ్లే భక్తులకు శుభవార్త తెలిపింది. సోన్ ప్రయాగ్-కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ రోప్ వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని మోడీ అధ్యక్షతన బుధవారం (ఈరోజు) జరిగిన మంత్రి మండలి సమావేశంలో ఈ రెండు ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ మేరకు కేబినెట్ భేటీ వివరాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణమ్ మీడియాకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం కేదార్‌నాథ్, హేమకుండ్ సాహిబ్ అనే రెండు రోప్‌వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిందని ఆయన చెప్పారు.

Advertisements
కేదార్‌నాథ్ రోప్‌వేకు కేంద్రం ఆమోదం

12.9 కి.మీ పొడవైన రోప్‌వే ప్రాజెక్ట్

జాతీయ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ -పర్వతమాల పరియోజన కింద ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్ నుంచి కేదార్‌నాథ్ వరకు 12.9 కి.మీ పొడవైన రోప్‌వే ప్రాజెక్ట్ అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం రూ.4,081 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. సోన్ మార్గ్ కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్ట్ పూర్తి అయితే.. కేదార్ నాథ్ చేరుకునేందుకు సమయం గణనీయంగా తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం సోన్ మార్గ్ నుంచి కేదార్ నాథ్ వెళ్లడానికి 8 నుంచి 9 గంటల సమయం పడుతుండగా.. అదే ఈ రోప్ వే ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే కేవలం 36 నిమిషాల్లో కేదార్ నాథ్ చేరుకోవచ్చని తెలిపారు.

12.4 కి.మీ. పొడవైన ఈ రోప్ వే

ఆస్ట్రియా, ఫ్రాన్స్ నిపుణుల సహాయంతో ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామన్నారు. అలాగే.. హేమకుండ్ సాహిబ్ రోప్ వే ప్రాజెక్టు కూడా కేంద్రం ఆమోద ముద్ర వేసిందని చెప్పారు అశ్వినీ వైష్ణవ్. 12.4 కి.మీ. పొడవైన ఈ రోప్ వే ప్రాజెక్టు హేమకుండ్ సాహిబ్‌ను గోవింద్ ఘాట్‌తో కలుపుతుందని.. ఈ ప్రాజెక్టుకు రూ.2,730.13 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. జాతీయ రోప్‌వేస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ – పర్వతమాల పరియోజనలో భాగంగా ఈ ప్రాజెక్ట్ అభివృద్ధి చేపట్టామని అన్నారు.

Related Posts
పుష్ప 2 ప్రీమియర్ షో వద్ద తొక్కిసలాట..బాలుడి పరిస్థితి విషమం
sandhya thater

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ మూవీ ప్రీమియర్ షోస్ మొదలయ్యాయి. ప్రీమియర్ షో చూసేందుకు అభిమానులు భారీ సంఖ్యలో థియేటర్ల Read more

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
telangana assembly sessions

హైదరాబాద్‌లో ఈరోజు నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10:30 గంటలకు మొదలవనున్న ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాలు చర్చకు రానున్నాయి. Read more

రాబోయే మూడు రోజులు జాగ్రత్త
summer

తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల Read more

ఈనెల 30 నుండి బీఆర్‌ఎస్‌ “గురుకుల బాట” కార్యక్రమం: కేటీఆర్‌
Will march across the state. KTR key announcement

హైదరాబాద్‌ : గురుకులాల్లో చోటు చేసుకుంటున్న వరుస విషాద ఘటనల నేపథ్యంలో ఈనెల 30 నుండి డిసెంబర్‌ ఏడో తేదీ వరకు బీఆర్ఎస్‌ పార్టీ తరపున "గురుకుల Read more

×