CBI searches former CM Bhupesh Baghel house

CBI Raids: మాజీ సీఎం ఇంట్లో సీబీఐ సోదాలు

CBI Raids: ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్ నివాసానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులు చేరుకున్నారు. ఆయన ఇంట్లో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ బృందాలు రాయ్‌పూర్, భిలాయ్‌లోని బాఘేల్ నివాసంతో పాటు ఓ సీనియర్ పోలీసు అధికారి, మాజీ ముఖ్యమంత్రి సన్నిహితుడి ఇంట్లో కూడా రైడ్స్ జరుపుతున్నారు. సీబీఐ అధికారులు ఆయన సన్నిహితులు వినోద్ వర్మ, దేవేంద్ర యాదవ్ నివాసానికి కూడా చేరుకున్నారని వర్గాలు తెలిపాయి.

మాజీ సీఎం ఇంట్లో సీబీఐ

మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు

వాస్తవానికి భూపేశ్ ప్రభుత్వ హయాంలో మద్యం, బొగ్గు, మహాదేవ్ సత్తా యాప్ వంటి అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణాలలో కొంతమంది అధికారులు దర్యాప్తు సంస్థల రాడార్‌లో కూడా ఉన్నారని సమాచారం. భూపేశ్ బాఘేల్ ఎక్స్‌ హ్యాండిల్ నుంచి ఓ ట్వీట్ వచ్చింది. ఏప్రిల్ 8, 9 తేదీల్లో అహ్మదాబాద్ (గుజరాత్)లో జరగనున్న ఏఐసీసీ సమావేశం కోసం ఏర్పాటు చేసిన ముసాయిదా కమిటీ భేటీకి మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ ఈరోజు ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణం

ఇటీవల, మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బాఘేల్ నివాసంపై దాడి చేసింది. మార్చి 10న, లిక్కర్ స్కామ్ కేసులో భూపేశ్ బాఘేల్ కుమారుడిపై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా దుర్గ్ జిల్లాలోని భిలాయ్ పట్టణంలోని ఆయన నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. ఈ సోదాల సమయంలో తన ఇంట్లోనే ఉన్న భూపేశ్ బాఘేల్ ఈడీ దాడికి సంబంధించి బీజేపీని విమర్శించారు. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం కుంభకోణం 2019- 2022 మధ్య జరిగింది. ఆ సమయంలో ఛత్తీస్‌గఢ్‌ను బాఘేల్ నేతృత్వంలోని కాంగ్రెస్ పాలించింది. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన మద్యం కుంభకోణం రాష్ట్ర ఖజానాకు భారీ నష్టాన్ని కలిగించిందని, మద్యం సిండికేట్ లబ్ధిదారులు రూ.2,100 కోట్లకు పైగా దోచుకున్నారని కేంద్ర ఏజెన్సీ గతంలో పేర్కొంది.

Related Posts
2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందే : అమిత్‌ షా ప్రకటన
Amit Shah is going to visit AP

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 నాటికి నక్సలిజాన్ని నిర్ములించాల్సిందేనని Read more

టికెట్ల రేట్లను పెంచడం.. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహించడమే : నారాయణ
Increasing the ticket rates is encouraging the black market.. Narayana

హైదరాబాద్‌: ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని సినీ ప్రముఖలు కలవనున్నారు. ఈభేటీ సీపీఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా టికెట్ల రేట్లను పెంచడం అంటే… Read more

ఫాన్స్ కు కోహ్లీ విన్నపం
ఫాన్స్ కు కోహ్లీ విన్నపం

ఆస్ట్రేలియాతో బాక్సింగ్ డే టెస్టులో విరాట్ కోహ్లీ అభిమానులకు చేసిన విన్నపం ఫాన్స్ కు కోహ్లీ విన్నపం: ఆస్ట్రేలియాతో గురువారం నుంచి ప్రారంభమయ్యే బాక్సింగ్ డే టెస్ట్ Read more

మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?
మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?

కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *