Amaravati capital case postponed to December says supreme court jpg

జైళ్లలో ఖైదీలపై కుల‌వివ‌క్ష స‌రికాదు: సుప్రీంకోర్టు

Supreme Court

న్యూఢిల్లీ : జైళ్లలో కులవివక్షపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కులం ఆధారంగా ఖైదీలకు పనుల అప్పగింత, జైలులో గదుల కేటాయింపునకు సంబంధించిన నిబంధనలను తప్పుబట్టింది. అభ్యంతరకరంగా ఉన్న నిబంధనలను మూడు నెలల్లో మార్చాలని పలు రాష్ట్రాలకు సూచించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ సారథ్యంలోని ధర్మాసనం గురువారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

కులం ఆధారంగా ఊడ్చడం, శుభ్రం చేయడం వంటి పనులను అట్టడుగు వర్గాలకు అప్పగించడం, వంట చేయడం లాంటి పనులను అగ్ర వర్ణాలకు అప్పగించడం అంటే అది ఆర్టికల్‌ 15ను అతిక్రమించడమేనని వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు. అలాంటి పనులు విభజనకు దారి తీస్తాయని పేర్కొంది. ఖైదీల పట్ల వివక్షకు కులం కారణం కారాదని స్పష్టం చేసింది. అలాంటి వాటిని అనుమతించేది లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. అందరికీ పని విషయంలో సమాన హక్కు కల్పించాలని పేర్కొంది. ప్రమాదకరంగా ఉన్న మురుగునీటి ట్యాంకులను శుభ్రం చేసే పనులకు ఖైదీలను అనుమతించకూడదని సూచించింది. ఓ ప్రత్యేక కులం వారిని స్వీపర్లుగా ఎంపిక చేయటం సమానత్వ హక్కుకు వ్యతిరేకమని ధర్మాసనం స్పష్టం చేసింది. కుల ఆధారిత వివక్షకు సంబంధించిన కేసుల పరిష్కారానికి పోలీసులు కూడా శ్రద్ధతో పనిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

జైళ్లలో కుల ఆధారిత వివక్ష, విభజన ఉందని ఆరోపిస్తూ మహారాష్ట్రలోని కల్యాణ్​కు చెందిన సుకన్య శాంత సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ ఏడాది జనవరిలోనే కేంద్రంతో పాటు ఉత్తర్​ప్రదేశ్​, బంగాల్​ సహా 11 రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు స్పందించిన ఆయా రాష్ట్రాలు ఖైదీలకు కులం ఆధారంగానే పనులు ఇవ్వడం, జైలులో గదులను కేటాయిస్తున్నట్లు పేర్కొన్నాయి. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. జైలు మాన్యువల్స్​లో ఉన్న ఇలాంటి అభ్యంతరకర నిబంధలను సవరించాలని ఆయా రాష్ట్రాలను ఆదేశించింది.

Related Posts
25న ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణ
mahadharna-postponed-in-nallagonda

తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారించనుంది. ఈ నెల 25న జస్టిస్ బీఆర్ గవాయ్, అగస్టిన్ జార్జ్ మసిహ్ లతో Read more

ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షినటరాజన్
ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షినటరాజన్

అధికారిక ప్రకటన : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ ను నియమించటంపై ఏఐసీసీ (ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ) అధికారికంగా ప్రకటన జారీ Read more

నేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి
CM Revanth Reddy will start Indiramma Houses today

మొదటి విడతలో 72,045 ఇళ్లకు శంకుస్థాపన హైదరాబాద్‌: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఈరోజు మరో అడుగు పడనుంది. జనవరి 26న తొలి విడతలో హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా Read more

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు
ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, శంకుస్థాపన చేశారు. హరిత శక్తి మరియు Read more