Caste census should be conducted in AP too.. YS Sharmila

ఏపీలో కూడా కులగణన చేపట్టాలి : వైఎస్ షర్మిల

అమరావతి: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే ఆదర్శమని.. ఇదో చారిత్రాత్మక ఘట్టమని.. ఈ సర్వే యావత్ భారతవనికి దిక్సూచి అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశంసించారు. దేశ భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ దూరదృష్టికి తెలంగాణ కులగణన నిదర్శనమని.. వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేస్తున్నామని షర్మిల ఎక్స్ వేదికగా తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర జనాభాలో 56 శాతం బీసీలు 17 శాతం ఎస్సీలు, 10 శాతం ఎస్టీలు, అంటే దాదాపు 90 శాతం వెనుకబడిన.. బలహీన వర్గాల ప్రజలే ఉండటం విస్మయపరిచిన అంశం అన్నారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని నమ్ముతుందన్నారు. మన రాష్ట్రంలో కూడా కులగణన చేపట్టాలని.. ఐదున్నర కోట్ల రాష్ట్ర జనాభాలో వెనుకబడిన వర్గాల వారి సంఖ్య తేల్చాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. కుల వివక్షకు గురవుతున్న బలహీన వర్గాల ప్రజలు ఎంత మంది ఉన్నారో లెక్కలు తీయాలని.. మనమెంతో మనకంతా అన్నట్టుగా రాజకీయ, సామాజిక, విద్యా, ఉద్యోగాల్లో వారి వాటా వారికి దక్కాలని జనాభా ప్రాతిపదికన న్యాయంగా రిజర్వేషన్లు అమలు కావాలని షర్మిల డిమాండ్ చేశారు.

image

గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టినా, బీజేపీ దత్తపుత్రుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టి, బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని విమర్శించారు. బీజేపీ డైరెక్షన్ లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారని మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే, రిజర్వేషన్లు రద్దుకు కుట్ర పన్నుతుందని బీజేపీ తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు. బీజేపీ ఉచ్చులో మీరు పడవద్దని, వెంటనే ఏపీలో కూడా కులగణన చేపట్టాలని చంద్రబాబును కోరారు.

Related Posts
డ్రై స్కిన్ మిమ్మల్ని నిద్ర పట్టకుండా చేస్తుందా..? అయితే మీరు ఇవి తినాల్సిందే..!!
dry skin

ప్రస్తుత కాలంలో పొడిచర్మం (డ్రై స్కిన్) సమస్యతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యకు పలు కారణాలు ఉంటాయి. తగినంత నీరు తాగకపోవడం, ఆహారపు అలవాట్లు, Read more

డ్రగ్స్ కేసులో ‘పిశాచి’ మూవీ నటి!
Actress Prayaga Martin Name

మలయాళ సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీని గురించి ఇంకా మాట్లాడుకుంటుండగానే తాజాగా డ్రగ్స్ వ్యవహారం సైతం తెరపైకొచ్చింది. ఇటీవల గ్యాంగ్ Read more

పోప్ ఫ్రాన్సిస్‌కు కొత్త శ్వాసకోశ సమస్యలు
పోప్ ఫ్రాన్సిస్‌కు కొత్త శ్వాసకోశ సమస్యలు

వాటికన్ ప్రకటన ప్రకారం, పోప్ ఫ్రాన్సిస్ సోమవారం తీవ్రమైన రెండు కొత్త శ్వాసకోశ సమస్యలను ఎదుర్కొన్నారు. దీంతో, ఆయన్ను మళ్లీ నాన్-ఇన్వాసివ్ మెకానికల్ వెంటిలేషన్‌కు మార్చారు. ఇది Read more

చాట్ జీపీటీ సృష్టికర్త సుచిర్ బాలాజీ అనుమానాస్పద మృతి
OpenAI whistleblower Suchir

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధనలో విశిష్టమైన పేరు సంపాదించుకున్న ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్ సుచిర్ బాలాజీ (26) అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. సుచిర్ శాన్‌ఫ్రాన్సిస్కోలోని Read more