పాశమైలారం (Pasamailaram) పారిశ్రామికవాడలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబానికి చెందిన యశ్వంత్ ఫిర్యాదు మేరకు సిగాచి కంపెనీ యాజమాన్యంపై బీడీఎల్ భానూర్ పోలీసులు కేసు నమోదు (Bhanur police have registered a case) చేశారు. భారతీయ న్యాయ విభాగంలోని 105, 110, 117 సెక్షన్ల కింద విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుతో కలిసి ఘటన స్థలానికి వెళ్లారు. సహాయక చర్యల పురోగతిని సమీక్షించారు. ఇప్పటివరకు పలువురు మృతదేహాలు బయటపడగా, 11 మందికి ఇప్పటికీ ఆచూకీ లేదని వెల్లడించారు. శిథిలాల కింద ఇంకా ప్రజలు ఉండే అవకాశం ఉందని, సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు.
వలస కార్మికుల ప్రాణాలు కోల్పోవడం బాధాకరం
పొట్టకూటి కోసం వలస వచ్చిన వారు ఇలా చనిపోవడం హృదయవిదారకం, అని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన భద్రతాపరమైన ప్రమాణాలు లేకపోవడానికే నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ ఘటన మళ్లీ పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం వెంటనే ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమల తనిఖీలు సరైన విధంగా జరుగుతున్నాయా అనే అనుమానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు.ఈ ప్రమాదానికి బాధ్యులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి, అని డిమాండ్ చేశారు. సిగాచి యాజమాన్యానికి చెందిన మరో మూడు పరిశ్రమలకూ తక్షణమే తనిఖీలు జరపాలని కోరారు.
శిథిలాల కింద మృతదేహాల కోసం పోలీస్ జాగిలాలు ఉపయోగించాలి
ఇంకా మృతదేహాలు ఉన్నాయనే అనుమానంతో, ప్రత్యేక జాగిలాలను వినియోగించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పారిశ్రామిక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అంబులెన్స్ లభ్యంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ విషయంలో కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా సహకరిస్తుందని తెలిపారు. మృతుల కుటుంబాలకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. “ఇది రాజకీయాల అంశం కాదు,” అంటూ విలేకరుల ప్రశ్నకు కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
Read Also : New BJP Chief : తెలుగు రాష్ట్రాల బీజేపీ కొత్త చీఫ్‌లకు చంద్రబాబు విషెష్