మాజీ మంత్రి పేర్ని నాని (Former Minister Perni Nani) మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల కృష్ణా జిల్లా అవనిగడ్డ, పామర్రు నియోజకవర్గాల్లో నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రప్పా రప్పా అనటం కాదు, చేసి చూపించండి. అంటూ కార్యకర్తల్ని రెచ్చగొట్టేలా మాట్లాడిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.పెర్ని నానిపై తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీడీపీ రాష్ట్ర నేత కనపర్తి శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ, బియ్యం దొంగ పేర్ని నాని శాంతిభద్రతలకు ప్రమాదం కలిగించేలా ప్రవర్తిస్తున్నారు” అని తీవ్ర విమర్శలు చేశారు. ఫిర్యాదు ఆధారంగా అవనిగడ్డ పోలీస్ స్టేషన్‌లో నానిపై కేసు నమోదు (Case registered against Nani) చేశారు.

పేర్ని వ్యాఖ్యలపై విపక్షాల ఆగ్రహం
జరిగిన ఈ పరిణామాలపై అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ, జనసేన నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మధ్య ఉద్రిక్తతకు దారి తీసేలా మాట్లాడిన నానిని వెంటనే శాసించాల్సిన అవసరం ఉందని వారు అంటున్నారు. నానిపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉధృతమైన నిరసనలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు వారు హెచ్చరించారు.
‘చీకట్లో కన్నుకొడితే అయిపోవాలే’ వ్యాఖ్యపై విమర్శలు
పెర్ని నాని వ్యాఖ్యలు సామాన్యుల నుంచి కూడా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. లోకేష్ రెడ్‌బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు.. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి.. అంటూ ఆయన చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. ఇది ప్రజలలో భయాన్ని రేకెత్తించేలా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు.
నానికి వృద్ధి కానందం?
ఒక మాజీ మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలా రెచ్చగొట్టేలా మాట్లాడటం బాధాకరమని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో చట్టం మీద నమ్మకం ఉండాలని, ఈ రకమైన మాటలు వదలాలని వారూ సూచిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Read Also : Anaconda : భారీ అనకొండ తోక పట్టుకుంటే ఏం జరిగిందో చూడండి..