Case registered against MLA Sudheer Reddy

Sudheer Reddy : ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై కేసు నమోదు

Sudheer Reddy : రంగారెడ్డిలోని ఎల్బీనగర్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. తనను దూషించారని హస్తినాపురం కార్పొరేటర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ప్రోటోకాల్ విషయంలో చెలరేగిన వివాదం ఇప్పుడు కేసుల వరకు వెళ్లింది. నియోజకవర్గంలోని మున్సురాబాద్‌ పరిధిలో కొన్ని అభివృద్ధి పనులకు సుధీర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇది స్థానిక కార్పొరేటర్‌ను పిలవకుండా కార్యక్రమం చేపట్టడంపై ఆ స్థానంలో గెలిచిన బీజేపీ కార్పొరేటర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను పిలువకుండా ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా చేస్తున్నారని మండిపడ్డారు.

image

బీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల పోటాపోటీ ఆందోళనలు

విమర్శలతో ఆగిపోని మన్సూరాబాద్ బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన అనుచరులతో వెళ్లి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి శంకుస్థాపన చేసిన పనులకే మళ్లీ శంకుస్థాపనలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆయన్ని వారి అనుచరులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. శంకుస్థాపన ఏరియాలో బీఆర్‌ఎస్, బీజేపీ వర్గాల పోటాపోటీ ఆందోళనలు, నినాదాలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి బీఆర్‌ఎస్ శ్రేణులను అరెస్టు చేసి స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్‌లో తన అనుచరులు ఉన్నారని తెలుసుకున్న సుధీర్ రెడ్డి హుటాహుటిని పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.

సుజాత నాయక్‌పై ఘాటు వ్యాఖ్యలు

అరెస్టు అయ్యి స్టేషన్‌లో ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణులను పరామర్శించారు. ఏం జరిగిందో తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. అవే ఇప్పుడు ఆయనపై విమర్సలకు కారణమయ్యాయి. స్టేషన్‌లో ఉన్న అనుచరులతో సమావేశమై వచ్చిన సుధీర్ రెడ్డి… కార్పొరేటర్లు కొప్పుల నర్సింహారెడ్డి, సుజాత నాయక్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుధీర్‌ రెడ్డి తనను దూషించారని ఎల్పీనగర్ పీఎస్‌లో బానోతు సుజాత ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

Related Posts
10 లక్షల వీసాలు.. అమెరికా కాన్సులేట్ సరికొత్త రికార్డు
10 lakh visas.. American Consulate new record

న్యూఢిల్లీ: వరుసగా రెండో సంవత్సరం విజిటర్‌ వీసాలతోసహా 10 లక్షలకు పైగా నాన్‌ ఇమిగ్రంట్‌ వీసాలను అమెరికా భారత్‌కు జారీ చేసింది. 2008/2009 విద్యా సంవత్సరం తర్వాత Read more

ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పులు
mat

అమెరికా ప్రతిపక్ష పార్టీ రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రతినిధి, ఫ్లోరిడా లోక్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ సభ్యుడు మ్యాట్ గేట్జ్ హౌస్‌ను విడిచిపెట్టారు. ఆయనను, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడు Read more

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ

ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, పొత్తులో Read more

రేవంత్‌ గాలి మాటలకు జవాబు చెప్పాలా? : కిషన్ రెడ్డి
Kishan Reddy comments on cm revanth reddy

హైదరాబాద్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఈరోజు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ..ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పై విమర్శలు గుప్పించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గాలి మాటలకు సమాధానం చెప్పాలా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *