Harish Rao stakes in Anand

మాజీ మంత్రి హరీష్ రావుపై కేసు నమోదు

హైదరాబాద్‌: పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి హరీష్ రావుపై మంగళవారం కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

Advertisements

తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని జూబ్లీహిల్స్ ఏసీపీకి సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై నవంబర్ 18న జూబ్లీహిల్స్ పోలీసుల విచారణకు ఆయన హాజరయ్యారు.చక్రధర్ గౌడ్ నుంచి ఆయన పోలీసులు వివరాలు తీసుకున్నారు. తన డ్రైవర్ తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని ఆయన ఆ ఫిర్యాదులో చెప్పారు. తన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చినట్టు నవంబర్ 18న ఆయన మీడియాకు చెప్పారు. అప్పటి ఇంటలిజెన్స్ డీసీపీ రాధాకిషన్ రావు తనను బెదిరించారని కూడా ఆయన ఆరోపించారు.

Related Posts
ఏపీ బడ్జెట్ పై వైసీపీ విమర్శలు
ఏపీ బడ్జెట్ పై వైసీపీ విమర్శలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టుతూ, గత వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో Read more

చికెన్, గుడ్ల కోసం రద్దీ అసలు కారణం ఇదే!
చికెన్, గుడ్ల కోసం రద్దీ అసలు కారణం ఇదే!

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదవుతుండటంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో కోళ్లు ఆకస్మికంగా చనిపోవడంతో అధికారులు సర్వే నిర్వహించి, బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లు Read more

చిన్మ‌య్ కృష్ణ దాస్‌కు బెయిల్ తిరస్కరణ
chinmaya krishna das

ఇస్కాన్ నేత చిన్మ‌య్ కృష్ణ దాస్ బ్ర‌హ్మ‌చారికి బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ నిరాక‌రించింది.న‌వంబ‌ర్ 25వ తేదీన చిన్మ‌య్ కృష్ణ దాస్‌పై దేశ‌ద్రోహం కేసు న‌మోదు అయ్యింది. ఆయ‌న్ను Read more

తెలంగాణలో కొత్తగా 12 మున్సిపాలిటీలు
12 new municipalities in Te

తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 12 ప్రాంతాలను మున్సిపాలిటీలుగా మార్చుతున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. అసెంబ్లీలో ఈ మేరకు ఆయన వెల్లడించారు. తెలంగాణలో పట్టణాభివృద్ధి కోసం ప్రభుత్వం Read more

×