TG SSC Exams: టెన్త్ ఎగ్జామ్స్ ఫీజు డేట్ వచ్చేసింది!

Follow Us: Google News Daily Hunt
Here are the dates for the Class 10 examination fees!
Here are the dates for the Class 10 examination fees!
FONT SIZE
GET APP

TG SSC Exams:తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం కీలక అప్‌డేట్ అందించింది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న ఎస్సెస్సీ (SSC) పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ అక్టోబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.

Read also: School holidays: స్కూళ్లకు మార్చిలోనే సమ్మర్ హాలిడేస్?

Here are the dates for the Class 10 examination fees!
Here are the dates for the Class 10 examination fees!

పరీక్ష ఫీజు మరియు ఆలస్య రుసుము గడువు తేదీలు

సాధారణ ఫీజుతో పాటు ఆలస్య రుసుము చెల్లించడానికి వివిధ తేదీలను కేటాయించారు

  • అక్టోబర్ 30 నుండి నవంబర్ 18 వరకు: ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా సాధారణ పరీక్ష ఫీజు రూ. 125 చెల్లించవచ్చు.
  • నవంబర్ 18 నుండి డిసెంబర్ 1 వరకు: రూ. 50 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించాలి.
  • డిసెంబర్ 3 నుండి డిసెంబర్ 14 వరకు: రూ. 200 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించే అవకాశం ఉంది.
  • డిసెంబర్ 18 నుండి డిసెంబర్ 28 వరకు: చివరిగా రూ. 500 ఆలస్య రుసుముతో ఫీజు చెల్లించవచ్చు.

ఫీజు మినహాయింపు వివరాలు

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులకు పరీక్ష ఫీజు నుంచి మినహాయింపు లభిస్తుంది. అయితే దీనికోసం కొన్ని ఆదాయ పరిమితులు వర్తిస్తాయి

  • పట్టణ ప్రాంతాలు: విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 24,000 మించకూడదు.
  • గ్రామీణ ప్రాంతాలు: కుటుంబ వార్షిక ఆదాయం రూ. 20,000 లోపు ఉండాలి.

అర్హత కలిగిన విద్యార్థులు తగిన ఆదాయ ధ్రవీకరణ పత్రాన్ని (Income Certificate) సంబంధిత పాఠశాల అధికారులకు సమర్పించి ఫీజు మినహాయింపు పొందవచ్చు.

TG SSC Exams:పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సూచనలు

  • పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియను పాఠశాల ప్రధానోపాధ్యాయులు (HM) పూర్తి చేయాలి.
  • బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (BSE) అధికారిక వెబ్‌సైట్ ద్వారా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి ఈ ప్రక్రియను నిర్వహించాలి.
  • విద్యార్థులు తమ ఉపాధ్యాయులను సంప్రదించి గడువులోగా ఫీజు చెల్లించి, ఆఖరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందస్తుగా ప్రక్రియను పూర్తి చేసుకోవడం మంచిది.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

మీకు నచ్చవచ్చు