తెలంగాణ (TG) రాష్ట్రంలో 2025 పది తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఇవాళ్టి (అక్టోబర్ 30) నుంచి ప్రారంభమైంది. ఈసారి పది పరీక్షలు రాయబోయే విద్యార్థులు నిర్ణీత గడువులోపు ఫీజును తప్పనిసరిగా చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. నవంబర్ 13వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లించవచ్చు.
Read Also: SEBI: సెబీలో మేనేజర్ పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ
విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాల హెడ్ మాస్టర్ (HM) కు నేరుగా పరీక్ష ఫీజును చెల్లించాలి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సేకరించిన మొత్తాన్ని నిర్ణీత గడువులోపే మాధ్యమిక విద్యా బోర్డు (BSE Telangana) ఖాతాలో జమ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ విద్యార్థులు నిర్ణీత తేదీకి ఫీజు చెల్లించకపోతే, వారికి ఆలస్య రుసుము వర్తిస్తుంది.రూ.50 ఆలస్య రుసుముతో నవంబర్ 29 వరకు, రూ.200తో డిసెంబర్ 11, రూ.500 ఎక్స్‌ట్రా ఫీజుతో డిసెంబర్ 19 వరకు చెల్లించవచ్చు. కాగా ఇంటర్ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత మార్చి మూడో వారంలో పది పరీక్షలు జరిగే అవకాశం ఉంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: