తెలంగాణ రాష్ట్రంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్, అగ్రికల్చర్ తదితర ప్రొఫెషనల్(TG EAPCET) కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్, ఐసెట్, ఈసెట్ వంటి పరీక్షల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించనున్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి (TGCHE) ఇప్పటికే వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also: Govt Jobs: DRDOలో 764 ఉద్యోగాలు.. జనవరి 1 వరకు దరఖాస్తు అవకాశం

డిసెంబర్ చివర్లో షెడ్యూల్ ప్రకటనపై అంచనాలు
డిసెంబర్ 27న ప్రభుత్వ ఆమోదం(TG EAPCET) లభిస్తే, అదే రోజు లేదా డిసెంబర్ 29, 30 తేదీల్లో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. పరీక్షల తేదీల కోసం లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేయడం గమనార్హం.
తేదీలపై ప్రాథమిక అంచనాలు
అధికారిక సమాచారం ప్రకారం తెలంగాణ ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమై, మే మొదటి వారంలో ముగిసే అవకాశముంది. గత సంవత్సరం అగ్రికల్చర్–ఫార్మా విభాగానికి సంబంధించిన ఈఏపీసెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి నిర్వహించిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ఈఏపీసెట్ పరీక్షలు మే 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: