Telangana PSC Group-I : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్-1 తుది ఫలితాలు విడుదల హైదరాబాద్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana PSC Group-I) బుధవారం రాత్రి గ్రూప్-1 సేవల నియామక తుది ఫలితాలను విడుదల చేసింది.
మొత్తం 563 పోస్టులు నోటిఫై చేయగా, 562 మంది అభ్యర్థులు తాత్కాలికంగా ఎంపిక అయ్యారు. ఒక పోస్టుకు సంబంధించిన ఫలితాన్ని కోర్టు కేసు కారణంగా నిలిపివేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in లో అందుబాటులో ఉంది.

కమిషన్ తెలిపిన ప్రకారం, తర్వాత ఏదైనా అభ్యర్థి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గానీ, లేదా ఏవైనా లోపాల కారణంగా ఎంపిక సక్రమంగా జరగలేదని గానీ తేలితే, ఆ అభ్యర్థి తాత్కాలిక ఎంపిక రద్దు చేయబడుతుంది. అదేవిధంగా, ఎంపికతో వచ్చిన ప్రయోజనాలన్నీ రద్దు చేయబడతాయి. అంతేకాక, TGPSC నిబంధనల ప్రకారం అవసరమైతే తగిన చర్యలు తీసుకునే హక్కు కమిషన్‌కు ఉందని పేర్కొంది.
Read also :