టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (TCC Exams) పరీక్షల తేదీలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పీ.వీ. శ్రీహరి విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ పరీక్షలను జనవరి 10 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. అభ్యర్థులు ముందుగానే హాల్‌టికెట్లు పొందుకుని పరీక్షలకు సన్నద్ధం కావాలని సూచించారు.
Read Also: Telangana: త్వరలోనే వైద్యశాఖలో 850 పోస్టుల భర్తీ ?

ఇదే సమయంలో నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (NETS)–2026 పరీక్ష ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది. ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు NTA వెల్లడించింది. పరీక్ష రాసిన అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్, సెక్యూరిటీ పిన్ ద్వారా ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
నెట్స్–2026 పరీక్షను డిసెంబర్ 21న దేశవ్యాప్తంగా 106 కేంద్రాల్లో, పెన్–పేపర్ ఆధారిత ఆఫ్‌లైన్ విధానంలో(TCC Exams) నిర్వహించారు. ఈ పరీక్షలో సాధించిన ర్యాంకు ఆధారంగా CBSE అనుబంధ ప్రైవేట్ విద్యాసంస్థల్లో 9వ, 11వ తరగతుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. కేంద్ర సామాజిక న్యాయ, సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న శ్రేష్ఠ పథకం ద్వారా, ఈ పరీక్షలో అర్హత సాధించిన ఎస్సీ బాలబాలికలకు దేశవ్యాప్తంగా సుమారు 3,000 సీట్లలో ప్రవేశాలు కల్పించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: