తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులను (TET) టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) భయం కాస్తగా కలవరపెడుతోంది. ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం, ప్రతి ఉపాధ్యాయుడు టెట్ పాస్ అవ్వాల్సిన అవసరం ఏర్పడింది. కోర్టు నిర్ణయం మేరకు, ఇప్పటికే ఐదు సంవత్సరాల పైగా ప్రభుత్వ సేవలో ఉన్న ఉపాధ్యాయులు, వచ్చే రెండేళ్లలో టెట్ పరీక్షలో అర్హత సాధించాలి. దీనికి విరుద్ధంగా ఉన్నవారు ఉద్యోగం వదిలివేయవలసి వస్తుందని తీర్పు పేర్కొంది. ఈ నిర్ణయం అనేక వాదనలకు తెరలేపడంతో ఉపాధ్యాయులలో తీవ్ర ఆందోళన ఏర్పడింది.
ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగడానికి, పదోన్నతులు పొందడానికి టెట్ తప్పనిసరి కావడంతో, ఇప్పటికే విధుల్లో ఉన్న టీచర్లకు భవిష్యత్తు అనిశ్చితిగా మారింది. గతంలో కొందరు ఉపాధ్యాయులు టెట్ లో అర్హత పొందకపోవడం కారణంగా కలవరంలో ఉన్నారు. 2010 ఆగస్టు 23న, విద్యాహక్కు చట్టం పరంగా నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) టెట్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రకారం, కొత్త నియామకాలలో టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కానీ అప్పటి సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు ఇవ్వబడింది.
కేవలం 791 మంది మాత్రమే ఉన్నట్లుగా
ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం డీఎస్సీ 1985 నుంచి మొన్నటి డీఎస్సీ 2024 వరకు ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో 2636 మంది టీచర్లు ఉండగా టెట్ పరీక్షలో అర్హత సాధించిన వారు కేవలం 791 మంది మాత్రమే ఉన్నట్లుగా విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.ఉపాధ్యాయ అర్హత పరీక్ష- టెట్‌ను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012లో ఒకసారి, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2017 ఒకసారి, 2024లో మరోసారి డీఎస్సీని నిర్వహించారు.
అంటే మూడు డీఎస్సీ (DSC) ల్లో నియమితులైన 743 మంది మాత్రమే టెట్ పరీక్షలో అర్హత సాధించగా రెండేళ్ల కిందట ఎన్‌సీటీఈ ఉత్తర్వులతోనూ కొంతమంది అర్హత సాధించారు. అలాంటి వారు కేవలం 48 మంది మాత్రమే ఉండటం గమనార్హం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని టీచర్ యూనియన్ నాయకులు కోరుతున్నారు.
ఏడాది వ్యవధిలో జిల్లాలో దాదాపు
ఇదిలా ఉంటే ఏడాది వ్యవధిలో జిల్లాలో దాదాపు 200 మందికిపైగా ఉపాధ్యాయులు జీహెచ్‌ఎంలుగా(గెజిటెడ్ హెడ్మాస్టర్), పీఎస్‌హెచ్‌ఎంలుగా, స్కూల్ అసిస్టెంట్లుగా టెట్ అర్హతలేకుండా ప్రమోషన్లు పొందారు. సుప్రీంకోర్టు (Supreme Court) తాజా తీర్పుతో రాబోవు పదోన్నతుల్లో జూనియర్లకు మేలు జరగనుంది.

టెట్ పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వాలని మెజార్టీ సంఘాలు ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చే యత్నం చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీర్పును పునః సమీక్షించేలా రివ్యూ పిటిషన్ వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. దీనిపై ఏవిధంగా ముందుకెళ్లాలనే దానిపై ఉపాధ్యాయులు ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తుమ్మ లచ్చిరాం, రాష్ట్ర అధ్యక్షుడు, టీయూటీఎఫ్
“మానవతా దృక్పథంతో సర్వీసులో ఉన్నవారికి ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఇందుకోసం విద్యాహక్కు చట్టం (Right to Education Act) లో మార్పులు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలి.
టెట్ పరీక్ష తప్పదని భావిస్తే మాత్రం పరీక్షలో మార్పులు చేసి అందరికీ సమానంగా 40 శాతం మార్కులే అర్హతగా నిర్ణయించాలి”- ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం టీచర్లు: 2636,టెట్ అర్హత గలవారు: 791,లేనివారు: 1845 మంది టీచర్లు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: