SBI PO రిక్రూట్‌మెంట్ 2025: 600 పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రొబేషనరీ ఆఫీసర్ (PO) పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ 2024-25 విడుదల చేసింది. మొత్తం 600 ఖాళీల కోసం ఈ నోటిఫికేషన్ విడుదలయ్యింది. అర్హత గల భారతీయుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 27 డిసెంబర్ 2024
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు: 16 జనవరి 2025
- ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 8వ & 15వ మార్చి 2025
- ప్రిలిమినరీ ఫలితాల విడుదల: ఏప్రిల్ 2025
- మెయిన్ పరీక్ష తేదీలు: ఏప్రిల్ / మే 2025
ఎంపిక విధానం:
SBI PO నియామక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది:
- ప్రిలిమినరీ పరీక్ష
- మెయిన్ పరీక్ష
- సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్ & ఇంటర్వ్యూ
SBI PO ఖాళీలు: డిగ్రీ అభ్యర్థులకి మంచి అవకాశం
అర్హత:
- గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి.
- వయస్సు (01.04.2024 నాటికి) కనిష్ట వయస్సు 21 సంవత్సరాలు, గరిష్ట వయస్సు 30 సంవత్సరాలు. వయస్సు సడలింపు కూడా ఉంది, OBC (నాన్-క్రీమీ లేయర్) కు 3 సంవత్సరాలు, SC/స్థ అభ్యర్థులకు 5 సంవత్సరాలు.
జీతం:
₹48,480/- (నాలుగు అడ్వాన్స్ ఇన్క్రీమెంట్‌లతో)
దరఖాస్తు రుసుము:
- జనరల్ / EWS / OBC అభ్యర్థులు: ₹750/-
- SC / ST / PwBD అభ్యర్థులు: రుసుము లేదు
SBI PO దరఖాస్తు ప్రక్రియ
- ఆన్‌లైన్ దరఖాస్తు 27 డిసెంబర్ 2024 నుండి 16 జనవరి 2025 వరకు.
- ప్రాథమిక వివరాలను నమోదు చేసి, దరఖాస్తు సమర్పించండి.
- స్కాన్ చేసిన ఫోటో, సంతకం, ఎడమ చేతి వేలిముద్ర, మరియు హ్యాండ్‌రిటెన్ డిక్లరేషన్‌ను అప్‌లోడ్ చేయాలి.
- డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా రుసుము చెల్లించాలి.
- అభ్యర్థులు తమ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచాలి, ఇది కమ్యూనికేషన్, హాల్ టికెట్‌లు మరియు ఫలితాల కోసం అవసరం.
- అభ్యర్థులు దరఖాస్తు సమర్పించిన తర్వాత, వారి సిస్టమ్ ద్వారా జనరేట్ అయిన ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ యొక్క ప్రింటౌట్ తీసుకోవాలి.
- దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదవడం మరియు అర్హతలను చెక్ చేయడం తప్పనిసరి.
ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోండి.