SBI Recruitment: బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు దేశీయ దిగ్గజ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (SBI) అద్భుతమైన అవకాశం కల్పించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సర్కిళ్లలో ఖాళీగా ఉన్న 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ (CBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. హైదరాబాద్, అమరావతి వంటి ప్రధాన నగరాలతో పాటు దేశంలోని అన్ని ప్రధాన సర్కిళ్లలో ఈ నియామకాలు జరగనున్నాయి.
Read Also:AP: త్వరలో DSC నోటిఫికేషన్: మంత్రి సవిత

ముఖ్య వివరాలు:
- మొత్తం ఖాళీలు: 2,273
- విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దీంతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం మరియు స్థానిక భాషపై పట్టు ఉండటం తప్పనిసరి.
- వయోపరిమితి: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి (ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది).
- వేతనం: ఎంపికైన వారికి నెలకు రూ. 48,480 నుండి రూ. 85,590 వరకు ఆకర్షణీయమైన జీతం మరియు ఇతర భత్యాలు లభిస్తాయి.
దరఖాస్తు ప్రక్రియ:
అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 29 నుండి ఫిబ్రవరి 18 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు పూర్తి వివరాల కోసం ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్ https://sbi.co.in/web/careers ని సందర్శించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: