దక్షిణ రైల్వేలో భారీగా ఉద్యోగ ఖాళీలు వెలువడ్డాయి. చెన్నై రీజియన్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యాక్ట్ అప్రెంటిస్ పోస్టు (Apprentice post) ల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3518 పోస్టులు భర్తీ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ ఉద్యోగాల కోసం రాత పరీక్ష లేకుండానే నేరుగా ఎంపిక చేసే విధానం అమల్లో ఉండడం విశేషం. అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.దక్షిణ రైల్వేలో విడుదలైన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, ఎంఎల్‌టీ (మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్), కార్పెంటర్, ఎంఎంవీ (మెకానికల్ మోటర్ వెహికల్), ఎంఎంటీఎం, మెషినిస్ట్, టర్నర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ విభాగాల్లో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్నాయి. ఈ విభాగాల్లో అర్హత కలిగిన అభ్యర్థులను శిక్షణా ప్రాతిపదికన (training basis) తీసుకోవడం జరుగుతుంది.సెప్టెంబర్ 26, 2025వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి.

ఖాళీల వివరాలు..
అప్రెంటిస్- క్యారేజ్ & వ్యాగన్ వర్క్స్, పెరంబూర్‌లో ఖాళీల సంఖ్య: 1394,సెంట్రల్ వర్క్‌షాప్, గోల్డెన్ రాక్‌లో ఖాళీల సంఖ్య: 857,సిగ్నల్ అండ్ టెలికమ్ వర్క్‌షాప్ యూనిట్స్, పొడనూర్‌లో ఖాళీల సంఖ్య: 1267,పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత పొందినవారు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్ధుల వయోపరిమితి తప్పనిసరిగా 2025 జనవరి 1వ తేదీ నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో సెప్టెంబర్ 26, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. విద్యార్హతల్లో సాధించిన మెరిట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి ఏడాది పాటు శిక్షణ ఉంటుంది. నెలకు రూ. 6000 నుంచి రూ.7000 వరకు స్టైపెండ్ చెల్లిస్తారు.
Read hindi news: https://hindi.vaartha.com/
Read Also: