దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్ (CSIR UGC NET) 2025 ఫలితాలు ఎట్టకేలకు వెలువడ్డాయి.నేడు, (ఆగస్ట్ 21) మధ్యాహ్నం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులు, పరిశోధకులలో ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), లెక్చరర్ అర్హత సాధన కోసం ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడు తమ భవిష్యత్ ప్రణాళికలను మరింత దృఢంగా సిద్ధం చేసుకునే అవకాశం పొందారు.ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 2025 జూన్ సెషన్ పరీక్షలు రాసిన అభ్యర్థుల ఫలితాలు ఈ మేరకు వెల్లడించినట్లు ఎన్టీయే పేర్కొంది. కాగా ఈ ఏడాది జులై 28న దేశ వ్యాప్తంగా ఒకటే రోజున ఈ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 1,95,241 మంది పరీక్షకు దరఖాస్తు చేసుకోగా.. వారిలో మొత్తం 1,47,732 మంది పరీక్షకు హాజరయ్యారు.

Read hindi news: hindi.vaartha.com
Read also: