బ్యాంక్ ఆఫ్ బరోడాలో మేనేజర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. దేశవ్యాప్తంగా విభిన్న శాఖల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ (Jobs 2025) కింద మొత్తం 50 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌లో అక్టోబర్ 30, 2025 లోపు సమర్పించాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ లేదా గ్రూప్ డిస్కషన్, తదుపరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా భారతదేశంలోని ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల్లో ఒకటి ఈసారి అనేక మేనేజర్ స్థాయికి ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ నుంచి క్రెడిట్ అనలిస్ట్, సీ & IC రిలేషన్‌షిప్ మేనేజర్ వంటి విభాగాల్లో పదవి అవకాశాలు ఉన్నాయి. ఇది బ్యాంకింగ్ రంగంలో మధ్యస్థాయిలో ఉన్నవారికి మంచి అవకాశం కలిగిస్తోంది.
Read also: 24 గంటల్లో సూపర్ ఫాస్ట్ డెలివరీ

ఖాళీల వివరాలు:
- మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) – 1 పోస్టు
- సీనియర్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) – 25 పోస్టులు
- చీఫ్ మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్) – 2 పోస్టులు
- సీనియర్ మేనేజర్ – C & IC రిలేషన్‌షిప్ మేనేజర్ – 16 పోస్టులు
- చీఫ్ మేనేజర్ – C & IC రిలేషన్‌షిప్ మేనేజర్ – 6 పోస్టులు
ఈ పోస్టులకు అర్హతగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం (Jobs 2025) నుంచి గ్రాడ్యుయేషన్ / పోస్ట్ గ్రాడ్యుయేషన్, లేదా CA / CMA / CS / CFA / డిప్లొమా వంటి అర్హతలు ఉండాలి. అదనంగా, సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
జీతం & వయోపరిమితి:
- మేనేజర్ పోస్టులకు: ₹64,820 – ₹93,960
- సీనియర్ మేనేజర్ పోస్టులకు: ₹85,920 – ₹1,05,280
- చీఫ్ మేనేజర్ పోస్టులకు: ₹1,02,300 – ₹1,20,940
- వయోపరిమితి: 25 నుండి 42 సంవత్సరాల మధ్య
దరఖాస్తు ఫీజు:
జనరల్ / OBC / EWS: ₹850
SC / ST / PwBD / మహిళలు: ₹175
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: