ముంబై పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్(Job Updates) ద్వారా మొత్తం 5 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలంటే అభ్యర్థులు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అదనంగా సంబంధిత రంగంలో పని అనుభవం ఉండటం తప్పనిసరి. అర్హత కలిగిన అభ్యర్థులు నిర్ణీత గడువు లోపల ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం, వేతన వివరాలు
దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక (Job Updates)చేపడతారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 వేతనంతో పాటు వర్తించే ఇతర అలవెన్సులు కూడా చెల్లించనున్నారు. ఈ ఉద్యోగాలు పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు పోర్ట్ కార్యకలాపాలకు సంబంధించిన ఎలక్ట్రికల్ పనులు, నిర్వహణ, పర్యవేక్షణ వంటి బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం
ఆసక్తి గల అభ్యర్థులు జనవరి 12 లోపు దరఖాస్తు చేయాలి. పూర్తి నోటిఫికేషన్, అర్హతలు, దరఖాస్తు విధానం వంటి వివరాల కోసం ముంబై పోర్ట్ అథారిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: