Job updates: కేంద్రీయ విద్యాలయాలు మరియు జవహర్ నవోదయ విద్యాల (Navodaya Vidyalaya)యాల్లో మొత్తం 14,967 ఖాళీలకు దరఖాస్తు గడువు పొడిగించబడింది. అసలు డిసెంబర్ 4తో ముగియాల్సిన గడువును, అభ్యర్థుల అభ్యర్థనల నేపథ్యంలో డిసెంబర్ 11 వరకు పెంచారు. ఇంకా దరఖాస్తు చేయని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Read Also: AP TET 2025: టెట్ హాల్‌టికెట్లు విడుదల

మెడికల్ పరీక్ష
ఈ నియామకాల్లో ఎంపిక ప్రాసెస్‌గా టైర్–1 పరీక్ష, టైర్–2 పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, చివరగా మెడికల్ పరీక్ష నిర్వహించబడుతుంది. పోస్టు ఆధారంగా PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, M.PEd, CTET, B.PEd, B.LiSc, ఇంటర్ లేదా డిప్లొమా అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
అభ్యర్థుల సౌకర్యం కోసం దరఖాస్తు పోర్టల్‌ను అప్‌డేట్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతుందని, ప్రతి దశలో అభ్యర్థులకు స్పష్టమైన సూచనలు అందించనున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 11 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ గడువు పొడిగించే అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ, ఆసక్తి ఉన్నవారు సమయానికి దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: