జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఇప్పటికే జేఈఈ (JEE) మెయిన్ రెండు సెషన్‌ల షెడ్యూల్ విడుదల కాగా, ఇప్పుడు అడ్వాన్స్‌డ్‌కు సంబంధించిన తేదీ కూడా నిర్ణయించబడింది. జేఈఈ మెయిన్ 2026 తొలి విడతకు దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. దరఖాస్తు లోపాల సవరణకు డిసెంబర్ 1 నుంచి 2వ తేదీ రాత్రి 11.50 వరకు అవకాశం కల్పించారు.
Read also: Job updates: 14,967 ఖాళీలకు మరో అవకాశం!

This is the date of JEE Advanced 2026
డిసెంబర్ 5న ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి
జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలు జనవరి 21 నుండి 30 వరకు, సెషన్ 2 పరీక్షలు ఏప్రిల్ 1 నుండి 10 వరకు ఆన్‌లైన్ విధానంలో జరగనున్నాయి. ఈ రెండు విడతల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన తొలి 2.5 లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే అర్హత ఉంటుంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష ఈసారి మే 17న నిర్వహించబడుతుంది. దేశంలోని 23 ఐఐటీల్లో బీటెక్, బీఎస్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములకు ప్రవేశం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ఏడాది పరీక్ష నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీకి అప్పగించారు. డిసెంబర్ 5న ప్రత్యేక వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి, త్వరలో పూర్తి వివరాలు విడుదల చేస్తామని ఐఐటీ రూర్కీ ప్రకటించింది. ప్రస్తుతం ఐఐటీల్లో మొత్తం 18,160 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
అడ్వాన్స్‌డ్ ఉత్తీర్ణులు బీఆర్క్ కోర్సులో చేరాలనుకుంటే AAT (Architecture Aptitude Test) తప్పనిసరిగా రాయాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: