హైదరాబాద్ : ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్(Teacher Eligibility Test) ఉత్తీర్ణత తప్పనిసరి చేస్తూ సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు జారీ చేసిన తీర్పును ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీనియర్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని, టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాలతోపాటు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన చట్టసవరణను చేయాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు.
Read Also: TG: తెలంగాణలో మరో రైల్వేలైన్‌కు గ్రీన్‌సిగ్నల్..
కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు
ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతున్న ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) ఉత్తీర్ణత కావాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు(Supreme court) ఈ ఏడాది సెప్టెంబర్ 1న తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో టెట్ నుంచి ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకి మినహాయింపు ఇప్పించేలా కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన విన్నపాల నేపథ్యంలో ప్రభుత్వం తరపున పాఠశాల విద్య శాఖ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. దాంతోపాటు పలు ఉపాధ్యాయ సంఘాలు కూడా సుప్రీంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. టిఎన్ యూటిఎఫ్, టిఆర్ఎఫ్ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి.

విద్యా హక్కు చట్టం అమలు
నల్గొండ-వరంగల్-ఖమ్మం నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్-ఆదిలాబాద్- నిజామాబాద్ – మెదక్ నియోజకవర్గ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ఇద్దరూ కూడా టెట్ నుంచి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి, ఎన్సిటిఈ ఛైర్మనికి వినతిపత్రాలు సమర్పించారు. టిఎస్ యూటిఎఫ్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి మెయిల్ ద్వారా విజప్తి చేయగా.. రాష్ట్రంలోని ఎంపీలకు వినతిపత్రాలు అందజేసింది. విద్యా హక్కు చట్టం అమలు, ఎన్సిటిఈ నోటిఫికేషన్కి పూర్వం నియామకమైన ఉపాధ్యాయులకు.. ఉపాధ్యాయ అర్హతపరీక్ష (టెట్) నుండి మిన
హాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు.
రెండేళ్ళలో టెట్ పాస్ కాక పోతే
సుప్రీంకోర్టు తీర్పు మూలంగా దేశవ్యాప్తంగా 25 లక్షల మంది, రాష్ట్రంలో 45 వేలమంది ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సుమారు 45వేల మంది ఉపాధ్యాయులు ఇబ్బంది పడనున్నారు. 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులకు మినహాయింపునిస్తూ, విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తు న్నారు. ఎన్సిటిఈ నోటిఫికేషన్కి ముందు నియామకమైన టీచర్లు టెట్(Teacher Eligibility Test) పరీక్ష వ్రాయాల్సిన అవసరం లేదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినందునే గత 15 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు టెట్ రాయలేదంటున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా రెండేళ్ళలో టెట్ పాస్ కాక పోతే ఉద్యోగానికి ఉద్వాసన పలుకుతామని చెప్పడం సమంజసం కాదని… సుప్రీంకోర్టు తీర్పు వచ్చి రెండు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రివ్యూపిటిషన్ వేయలేదని ఉపాధ్యా యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేట (Monday) నుండి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చట్టాన్ని సవరించి సీనియర్ ఉపాధ్యాయుల ఉద్యోగాలకు రక్షణ కల్పించాలని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు, ఉపా ధ్యాయ ఎమ్మెల్సీలు డిమాండ్ చేస్తున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: