జాయింట్ సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్(CSIR UGC NET) డిసెంబర్ 2025 సెషన్ పరీక్ష తేదీలు దగ్గరపడుతున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్షలకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు విడుదల చేసినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) ప్రకటించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ మరియు సెక్యూరిటీ పిన్‌ను నమోదు చేసి పరీక్ష నగర స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 18న దేశవ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్ష ఆన్‌లైన్ విధానంలో నిర్వహించబడనుంది. మొత్తం రెండు సెషన్‌లలో పరీక్ష జరుగుతుంది.
Read also: AP: రేపటి నుంచి TET..

షిఫ్ట్ 1 (ఉదయం 9 – మధ్యాహ్నం 12 గంటలు)
1. లైఫ్ సైన్సెస్
2.ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ & ప్లానెటరీ సైన్సెస్
షిఫ్ట్ 2 (మధ్యాహ్నం 3 – సాయంత్రం 6 గంటలు)
1. కెమికల్ సైన్సెస్
2. మ్యాథమేటికల్ సైన్సెస్
3. ఫిజికల్ సైన్సెస్
పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు నాలుగు రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఎన్టీయే ప్రకటించింది.
సీఎస్‌ఐఆర్–యూజీసీ నెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు జేఆర్‌ఎఫ్‌తో పాటు సైన్స్ విభాగాల్లో రిసెర్చ్ అవకాశాలు లభిస్తాయి. అలాగే అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాలు మరియు పీహెచ్‌డీ అడ్మిషన్‌లకు కూడా ఈ అర్హత ఉపయోగపడుతుంది. జేఆర్‌ఎఫ్ పొందిన వారు సీఎస్‌ఐఆర్ పరిశోధనా సంస్థలు మరియు విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: