స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న 996 పోస్టులకు దరఖాస్తు గడువును బ్యాంక్(Bank jobs) పొడిగించింది. ముందుగా నేటితో ముగియాల్సిన అప్లికేషన్ ప్రక్రియను ఇప్పుడు జనవరి 5 వరకు పెంచినట్లు ఎస్‌బీఐ ప్రకటించింది.
Read also: TG: మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు

ఈ నియామకాలకు సంబంధించి అభ్యర్థులు సంబంధిత పోస్టును బట్టి డిగ్రీ, MBA, CFP లేదా CFA అర్హతలు కలిగి ఉండటంతో పాటు, అవసరమైన పని అనుభవం కూడా ఉండాలి. మొత్తం పోస్టుల్లో హైదరాబాద్‌లో 43, అమరావతిలో 29 ఉద్యోగాలు ఉన్నాయి.
ఈ భర్తీలు వైస్ ప్రెసిడెంట్(Vice President), అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(Assistant Vice President), కస్టమర్ రిలేషన్‌షిప్ ఎగ్జిక్యూటివ్(Customer Relationship Executive) వంటి పోస్టుల కోసం చేపడుతున్నారు. అభ్యర్థుల ఎంపికను షార్ట్‌లిస్టింగ్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా నిర్వహిస్తారు.
అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవడానికి ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
వెబ్‌సైట్: sbi.bank.in
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: