Bangarappa: కర్ణాటక ప్రభుత్వం ఈ సంవత్సరం నుండి పదో తరగతి పాస్ మార్కులను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. గతంలో ప్రతి సబ్జెక్ట్‌లో కనీసం 35 మార్కులు (35%) రావాల్సిన నియమం ఉండేది. ఇప్పుడు, 33 మార్కులు (33%) మాత్రమే పొందితే విద్యార్థులు పాస్ అవుతారని కర్ణాటక karnataka) ప్రాథమిక విద్యాశాఖ మంత్రి మధు బంగారప్ప చెప్పారు. ఈ నిర్ణయం ముఖ్యంగా ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యి, పునరావృత పరీక్షలకు వేచి ఉండే విద్యార్థులు చదువుకు దూరమవ్వడం, తద్వారా వారి కుటుంబాలు పిల్లలను పని లేదా పెళ్లికి పంపడం వంటి సమస్యలను నివారించడానికి తీసుకోవడం జరిగింది.
US: ఇకపై భారత్ రష్యా చమురు కొనదు..ట్రంప్

good news for class 10 students
కొత్త రూల్ ముఖ్యాంశాలు:
- ప్రతి సబ్జెక్ట్‌లో 33 మార్కులు సాధిస్తే పాస్ అవుతారు.
- రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలకు ఈ రూల్ వర్తిస్తుంది.
- ఉదాహరణకు, ఈ సంవత్సరం ఎస్ఎస్ఎల్‌సీ మొత్తం మార్కులు 625 ఉంటే, 33 శాతం అంటే 206 మార్కులు పొందిన విద్యార్థులు ఉత్తీర్ణులుగా పరిగణింపబడతారు.
మంత్రిగారి ప్రకారం, ఈ చర్య వల్ల విద్యార్థులు చదువుకు దూరం కాకుండా, విద్యార్ధులకు ప్రోత్సాహం కలుగుతుంది.
కర్ణాటక ప్రభుత్వం పదో తరగతి పాస్ మార్కులను ఎంతకు తగ్గించింది?
ప్రతి సబ్జెక్ట్‌లో 35 మార్కుల నుండి 33 మార్కులకు తగ్గించారు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
ఒకటి రెండు మార్కుల తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు, మరియు వారికి ప్రోత్సాహం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: