హైదరాబాద్ ICET Counseling : రాష్ట్రంలోని ఎంబిఏ, ఎంసీఏ సీట్ల (MBA, MCA seats) భర్తీ కోసం నిర్వహించిన ఐ 25-2025 కౌన్సెలింగ్ బుధవారం నుంచి ప్రారంభం కాగా.. ఇప్పటి వరకు 13,056 మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నట్టు సాంకేతిక విద్య శాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28 వరకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. శుక్రవారం నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం కాగా.. మొదటి రోజు 2992 మంది హాజరయ్యారు. ఈ నెల 29 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. అయితే ఈ నెల 27 ఆదివారం కావడంతో 3 రోజు సర్టిఫికెట్ వెరిఫికేషన్ (Certificate Verification) ఉండదని ప్రకటించారు. ఈ నెల 25 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి అవకాశమిచ్చారు. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన వారికి సెప్టెంబర్ 2న సీట్ల కేటాయింపు చేయనున్నారు.
ICET Website : icet-sche.aptonline.in
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :