తమిళనాడులో రాజ్యసభకు (To the Rajya Sabha) మరోసారి రాజకీయ వేడి మొదలైంది. ఈ నెల 19న జరగనున్న ఎన్నికలపై అన్ని పార్టీలూ పూర్తి స్పష్టతకు వచ్చాయి. ఇప్పటికే అభ్యర్థుల పేర్లను ప్రకటించడంలో డీఎంకే, అన్నాడీఎంకే ముందుండటం విశేషం.ప్రస్తుత అసెంబ్లీ స్థానాల బలాబలాల ప్రకారం, మొత్తం 6 రాజ్యసభ సీట్లలో 4 సీట్లు డీఎంకే ఖాతాలోకి వెళ్లే అవకాశం ఉంది. మిగిలిన రెండు సీట్ల కోసం అన్నాడీఎంకే (AIADMK), బీజేపీ మిత్రపక్షాల మద్దతుతో పోటీకి సిద్దమవుతోంది.చెన్నైలో ఆదివారం కీలక ప్రకటన చేసింది అన్నాడీఎంకే. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి కెపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ, ఇంబదురై, ఎం.ధనపాల్‌లను అభ్యర్థులుగా ఎంపిక చేశామని తెలిపారు. ఈ నామినేషన్లకు పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు.
డీఎంకే నుంచి ముగ్గురు, మక్కల్ నీది మయ్యంకు ఒక్క సీటు
ఇతరపక్క, అధికార డీఎంకే ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించింది. సీనియర్ అడ్వకేట్ పి. విల్సన్, పార్టీ నాయకుడు ఎస్ఆర్ శివలింగం, కవయిత్రి రూకయ్య మాలిక్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. నాల్గవ సీటును భాగస్వామ్య పార్టీ ఎంఎన్ఎంకు కేటాయించారు. కమల్‌హాసన్‌ను అధికారికంగా అభ్యర్థిగా ప్రకటించారు.
2026లో డీఎండీకేకు రాజ్యసభ సీటు
ఇక, డీఎంకే బలోపేతంలో భాగంగా డీఎండీకే పార్టీకి ఒక హామీ ఇచ్చింది అన్నాడీఎంకే. 2026లో ఒక రాజ్యసభ సీటు మిత్రపక్షమైన డీఎండీకేకు కేటాయిస్తాం, అని కెపీ మునుస్వామి స్పష్టం చేశారు.
రిటైర్ అయ్యే ప్రముఖులలో వైకో, అన్బుమణి
ఈసారి రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నవారిలో వైకో (ఎండీఎంకే), అన్బుమణి రామదాస్ (పీఎంకే) వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు పార్టీలు తమకు అనుకూలమైన నాయకులను రంగంలోకి దించుతున్నాయి.ఇక ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో తమిళనాడు రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కొత్త ముఖాలు, అనుభవజ్ఞులు కలసిన బలమైన పోటీ కనిపిస్తోంది. డీఎంకే తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? లేక అన్నాడీఎంకే–బీజేపీ గేమ్‌చేంజర్ అవుతాయా? జూన్ 19న స్పష్టత వస్తుంది.
Read Also : Amit Shah : మమతా బెనర్జీపై అమిత్‌షా ఫైర్