సరస్వతీ పవర్ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు..ఏపీ సర్కార్‌

అమరావతి: సరస్వతీ పవర్ ప్లాంట్‌కు కేటాయించిన అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. సరస్వతీ భూముల్లో అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయన్న అధికారుల నివేదికతో చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా మాచవరం మండలం వేమవరంలో సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూముల రిజిస్ట్రేషన్‌ను క్యాన్సిల్ చేసింది. వేమవరంలో 20 ఎకరాలు, పిన్నెల్లి గ్రామంలో 4.84 ఎకరాల అసైన్డ్ భూమి రిజిస్ట్రేషన్‌ను కలెక్టర్ అరుణ్‌బాబు ఆదేశాలతో అధికారులు రద్దు చేశారు. ఈ మేరకు పిడుగురాళ్ల సబ్ రిజిస్ట్రార్ సురేశ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఆ భూములు వెనక్కు తీసుకోవాలని ఆదేశించారు.

కాగా, పల్నాడు జిల్లా జగన్ కుటుంబానికి సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు కేటాయించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 1,516 ఎకరాల భూముల్లో అటవీ, ప్రభుత్వ భూములు ఉన్నాయనే ఆరోపణలు వచ్చాయి. చెన్నయపాలెం, వేమవరం, పిన్నెల్లి, తంగెడ గ్రామాల్లో మొత్తం 1,250 ఎకరాలు రైతుల నుంచి సరస్వతీ పవర్ ప్లాంట్ యాజమాన్యం కొనుగోలు చేసింది. అయితే, అప్పటి నుంచి ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేయలేదని స్థానికులు ఆరోపించారు. ఇదే భూముల్లో అటవీ శాఖ భూములు కూడా ఉన్నాయన్న వివాదంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సైతం పర్యటించారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

image

డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో కదిలిన అధికార యంత్రాంగం సదరు భూముల్లో పూర్తి స్థాయి సర్వే చేపట్టింది. గత నవంబరులో అసైన్డ్ ల్యాండ్స్‌కు సంబంధించిన వ్యవహారంపై రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సర్వే నిర్వహించారు. ఇందులో భాగంగానే వేమవరం, పిన్నెల్లి గ్రామాల్లో 24.84 ఎకరాల అసైన్డ్ ల్యాండ్ ఉన్నట్లు గుర్తించారు. ఈ భూములు రద్దు కోరుతూ నివేదిక ఇవ్వడంతో సరస్వతి పవర్ ప్లాంట్స్ భూమిలోని అసైన్డ్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు.

Related Posts
తెలుగు రాష్ట్రాలు ‘గజగజ’
Extreme Cold

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత ప్రజలను గజగజ వణికిస్తోంది. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రంగా నమోదవుతోంది. బేల ప్రాంతంలో 6.6 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత Read more

హైదరాబాద్‌ వేదికగా దేశంలోనే మొట్టమొదటి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ స్టోర్‌ను ప్రారంభించిన ‘‘విక్టర్‌’’..
333

-స్టోర్‌లో కస్టమర్‌లు ఉత్పత్తులను ఎక్స్‌పీరియన్స్‌ చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్ట్.. హైదరాబాద్: ప్రపంచంలోనే టాప్‌ -2 బ్యాడ్మింటన్ బ్రాండ్ ‘‘విక్టర్ రాకెట్స్’’ హైదరాబాద్‌లోని కొండాపూర్‌ Read more

కెన్యా బంగారు గనిలో చిక్కుకుపోయిన 20 మంది మైనర్లు!
kenya

పశ్చిమ కెన్యాలోని బంగారు గని పాక్షికంగా కూలిపోవడంతో డజను మంది చిక్కుకుపోయారని పోలీసులు మంగళవారం తెలిపారు. పొరుగు దేశాలతో పోలిస్తే కెన్యాలో చిన్న మైనింగ్ రంగం ఉంది. Read more

BRICS Pay: స్వదేశీ కరెన్సీలతో అంతర్జాతీయ చెల్లింపులకు సులభతరం
brics pay

రష్యాలో ఇటీవల జరిగిన BRICS సమ్మిట్‌లో, రష్యా "BRICS Pay" అనే చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త చెల్లింపుల వ్యవస్థ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంబంధాలను మరింత Read more