కెనడాలో భారత సంతతికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హర్జీత్ లడ్డా హత్యకేసు తీవ్ర కలకలం రేపుతోంది. ఎన్నేళ్లుగా ఒంటారియోలో స్థిరపడిన హర్జీత్, స్థానికంగా ఆదరణ పొందిన వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇటీవల మిస్సిసాగా ప్రాంతంలోని ఓ పార్కింగ్ లాట్‌లో అతనిపై దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు.
కాల్పుల అనంతరం ఆసుపత్రిలో మృతి
ఒంటారియో, మిసిసాగా పార్కింగ్ లాట్‌లో ఆయనపై కొందరు దుండగులు విచక్షణరాహితంగా కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. ఈ కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన హర్జీత్‌ను కుటుంబ సభ్యులు అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన బుధవారం జరిగింది అయినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుమార్తె గూర్లీన్ ప్రకటనతో కేసు వెలుగులోకి
హర్జీత్ మృతిపై కూతురు గుర్లీన్ ఓ ప్రకటన విడుదల చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తన తండ్రికి పలుమార్లు బెదిరింపులు వచ్చాయని, పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. తమను కాపాడాల్సిన పోలీస్ వ్యవస్థ పూర్తి విఫలమైందని ఆరోపించారు.
లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్పై అనుమానాలు
ఈ హత్యపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తమదే బాధ్యతగా ప్రకటించినట్టు ప్రాథమిక సమాచారం. ఇప్పటికే భారతదేశంలో అనేక హత్యల వెనుక ఈ గ్యాంగ్ ప్రమేయం ఉన్నట్టు పోలీసుల విచారణల్లో తేలింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కెనడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Read also: US Embassy Warning : భారతీయులకు అమెరికా ఎంబసీ హెచ్చరిక.. శాశ్వత నిషేధమంటూ వార్నింగ్