గుండెపోటును ముందే ఊహించవచ్చా? ఈ ముఖ్యమైన లక్షణాలను తప్పక తెలుసుకోండి

గుండెపోటును ముందే ఉహించవచ్చా?

ఆధునిక జీవనశైలి, అధిక ఒత్తిడి, తప్పుడు ఆహారపు అలవాట్ల కారణంగా గుండె సంబంధిత వ్యాధులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధులకు మాత్రమే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉండేది. కానీ, నేటి కాలంలో యువత, మధ్యవయస్కులు, కొన్నిసార్లు పిల్లలు సైతం గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు. గుండెపోటు అకస్మాత్తుగా వస్తుందనుకోవడం పొరపాటే! అసలు నిజం ఏమిటంటే, గుండెపోటు రాకముందే కొన్ని సంకేతాలను మన శరీరం ఇస్తుంది. కానీ అవి తెలియక, లైట్ తీసుకోవడం వల్ల ప్రాణాపాయం జరుగుతుంది. గుండెపోటు వచ్చే ముందు కనపడే లక్షణాలను ముందుగా గుర్తిస్తే, నివారించేందుకు చర్యలు తీసుకోవచ్చు. ఈ కథనంలో గుండెపోటు రాకముందు కనిపించే ముఖ్యమైన లక్షణాలు, వాటిని ఎలా గుర్తించాలి, ముందస్తు జాగ్రత్తలు ఏమిటో తెలుసుకుందాం.

Advertisements
870475 blood circulation

గుండెపోటుకు 30 రోజుల ముందు కనిపించే ప్రధాన లక్షణాలు

1. ఛాతీ నొప్పి – భుజం, దవడ వరకు వ్యాపించే నొప్పి

గుండెపోటుకు ప్రధాన లక్షణాల్లో ఛాతీ నొప్పి (Chest Pain) అత్యంత ముఖ్యమైనది. ఇది ముఖ్యంగా ఛాతీ మధ్యభాగంలో ఒత్తిడిగా అనిపించవచ్చు. కొన్నిసార్లు, ఈ నొప్పి భుజం, చేయి, మెడ, దవడ, వెన్ను వరకూ వ్యాపించే అవకాశం ఉంటుంది.ఈ లక్షణాన్ని లైట్ తీసుకోవడం ప్రాణాంతకం! వెంటనే వైద్యులను సంప్రదించాలి.

2. అధిక అలసట – బలహీనత

గుండె సరైన విధంగా పనిచేయకపోతే, శరీరంలోని రక్తప్రసరణ తగ్గిపోతుంది. దీని వలన శరీరంలో ఎనర్జీ తగ్గిపోతుంది, అధిక అలసట, బలహీనత కలుగుతాయి.ఏమీ చేయకపోయినా అలసట అనిపిస్తుందా? వెంటనే డాక్టర్‌ని సంప్రదించండి.

3. తల తిరగడం – మూర్ఛ

గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నవారిలో తరచుగా తలతిరుగుదల సమస్య కనిపిస్తుంది. శరీరంలోని రక్తప్రసరణ సరిగ్గా లేకపోతే తలతిరగడం, కిందపడిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. పదే పదే తల తిరుగుతోందా? ఇది హార్ట్ ప్రాబ్లం సంకేతమై ఉండొచ్చు!

4. ఊపిరి ఆడకపోవడం

గుండెబలహీనత వలన ఊపిరితిత్తులకు సరిపడా రక్తప్రసరణ జరగదు. దీని వలన సాధారణంగా తేలికపాటి శ్రమ చేసినా ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. అసహజంగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే.. నిర్లక్ష్యం చేయకండి.

5. మోకాళ్ళు, కాళ్ళు, కడుపు భాగంలో వాపు

గుండె సరైన రీతిలో పనిచేయకపోతే, శరీరంలోని ద్రవాలు నిల్వ అవుతాయి. దీని వలన మోకాళ్లు, కాళ్లు, కడుపు వంటి భాగాల్లో వాపు ఏర్పడుతుంది. ఈ లక్షణాన్ని కాస్తైనా గుర్తిస్తే, ఆలస్యం చేయకండి.

6. అనారోగ్యకరమైన నిద్రపట్టడం

గుండె సమస్యలు ఉన్నవారు అర్థరాత్రి అకస్మాత్తుగా ఉలిక్కిపడి లేచే ప్రమాదం ఉంది. ఇది ఊపిరాడకపోవడం, గుండె ఒత్తిడికి సంకేతం కావచ్చు. నిద్రపోవడానికి ఇబ్బంది పడుతున్నారా? ఇది గుండె ఆరోగ్యానికి సంబంధించి హెచ్చరిక కావచ్చు.

7. మలబద్ధకం – జీర్ణ సమస్యలు

గుండె సమస్యలు ఉన్నవారిలో జీర్ణ సంబంధిత సమస్యలు కూడా కనిపించవచ్చు. కడుపు ఉబ్బరంగా అనిపించడం, మలబద్ధకం, వాంతులు రావడం వంటి లక్షణాలు కొన్ని సందర్భాల్లో గుండెపోటుకు ముందు కనిపించవచ్చు. పెట్టె నొప్పి, మలబద్ధకం ఉంటే అది గుండె సంబంధిత సమస్య కావచ్చు!

గుండెపోటును నిరోధించడానికి ముందస్తు జాగ్రత్తలు

ఆహార నియంత్రణ:
నూనె పదార్థాలు, ఎక్కువ కొవ్వు ఉండే ఆహారాన్ని తగ్గించండి. తాజా కాయగూరలు, పండ్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం తీసుకోండి. అధిక ఉప్పు, చక్కెర తగ్గించండి.

నిత్యం వ్యాయామం:
రోజుకు కనీసం 30 నిమిషాలు నడవడం, యోగా, మెడిటేషన్ చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
బరువు పెరగకుండా చూసుకోవాలి.

మెడికల్ చెకప్:
రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను తరచుగా పరీక్షించుకోవాలి. గుండె సంబంధిత కుటుంబ చరిత్ర ఉంటే, ప్రతి ఏడాది హార్ట్ చెకప్ చేయించుకోవాలి.

ధూమపానం, మద్యం వీలైనంత వరకు మానేయాలి.
ధూమపానం గుండె నాళాల్లో ముట్టడి పెంచి గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది. మద్యం అధికంగా తాగడం హార్ట్‌కి హాని కలిగించవచ్చు. అధిక బరువు గుండెకు ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది ఆరోగ్యకరమైన బరువును కాపాడుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం, ప్రాణాయామం చేయడం మంచిది సరైన నిద్ర అవసరం. గుండెపోటు అకస్మాత్తుగా రాదని, దానికంటే ముందే శరీరం కొన్ని సంకేతాలను ఇస్తుందని మనం గుర్తించాలి. ఛాతీ నొప్పి, అలసట, తలతిరగడం, ఊపిరాడకపోవడం వంటి లక్షణాలను లైట్ తీసుకోవడం ప్రాణాపాయం. ముందుగా జాగ్రత్తలు తీసుకుని, వైద్యులను సంప్రదించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

Related Posts
ప్లాస్టిక్ బాటిల్స్ తో ప్లాంటర్స్ తయారీ
plants

ప్లాస్టిక్ వాడకం అధికంగా పెరుగుతున్న ఈ రోజుల్లో పాత ప్లాస్టిక్ బాటిల్స్‌ని వదిలేయకుండా ఉపయోగకరంగా మార్చుకోవడం చాలా అవసరం. ఈ ప్రయత్నంలో పాత బాటిల్స్‌ను ప్లాంటర్స్ గా Read more

ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2024!
world aids day

ప్రపంచంలో అన్ని దేశాల్లో ఎయిడ్స్‌ వ్యాధి గురించి అవగాహన కలిగించడానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం నిర్వహించబడుతుంది. ఈ రోజు ఎయిడ్స్ మరియు Read more

బొప్పాయి: మీ శరీరానికి సహజ పోషకాలను అందించే పండు..
papaya

బొప్పాయి అనేది ఒక రుచికరమైన పండు మాత్రమే కాదు, ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలిగిన అధిక పోషకాలను కలిగి ఉంటుంది. ఈ పండులో యాంటీ-ఆక్సిడెంట్లు, పొటాషియం, విటమిన్ Read more

పిల్లల దినోత్సవం!
childrens day

ప్రతి సంవత్సరం నవంబర్ 14న ప్రపంచం మొత్తానికి "పిల్లల రోజు"ను జరుపుకుంటుంది. భారత్ లో, ఈ రోజు ప్రత్యేకమైనది, ఎందుకంటే ఇది స్వాతంత్ర్య సమరయోధులు, దేశభక్తి, మరియు Read more

×