ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఐఫ్తార్ విందును ముస్లిం సంఘాలు బహిష్కరించాలని నిర్ణయించాయి. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా పలు ముస్లిం సంఘాలు, ప్రముఖులు సమావేశమై ప్రభుత్వ వైఖరిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ముఖ్యంగా వక్ఫ్ సవరణ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు.
వక్ఫ్ సవరణ బిల్లును ఉపసంహరించాలని డిమాండ్
ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో పాటు, ఇతర ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి. ఈ బిల్లు ముస్లింల హక్కులను హరించుకునేలా ఉందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముస్లింల ఆస్తుల పరిరక్షణకు ప్రభుత్వ అనుగుణంగా నిర్ణయాలు ఉండాలని, లేదంటే మరింత తీవ్ర ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు.

ఇఫ్తార్ విందును బహిష్కరించనున్న ముస్లిం సంఘాలు
ప్రభుత్వం నిర్వహించే ఇఫ్తార్ విందును ముస్లిం సంఘాలు పూర్తిగా బహిష్కరించనున్నాయి. దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తూ, ముస్లిం సమాజానికి ప్రభుత్వ అనుసరణ విధానం అసంతృప్తిని కలిగిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వంతో చర్చలు జరిగినా ఎటువంటి సానుకూల నిర్ణయం రాకపోవడంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
29న నిరసనకు పిలుపు
ఇఫ్తార్ విందును బహిష్కరించడం ఒక్కటే కాకుండా, ఈ నెల 29న ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. ఈ నిరసనలో ముస్లిం సంఘాల ప్రతినిధులు, మత ప్రముఖులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. ప్రభుత్వ వైఖరి మారకపోతే, ఇంకా తీవ్రమైన ఆందోళనలు చేపడతామని ముస్లిం నేతలు హెచ్చరించారు.