పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా (Calcutta) లో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించేలా ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇది ఉత్తమ విద్యాసంస్థగా పేరొందిన ఐఐఎమ్ కోల్‌కతా (IIM Kolkata) లో జరిగిన అవాంఛనీయ సంఘటన. అకడమిక్ ప్రతిష్ఠకు నిదర్శనంగా నిలిచే ఈ విద్యాసంస్థలో అబద్ధాల వలలోకి వెళ్లిన యువతి, తీవ్ర మానసిక మరియు శారీరక హింసను అనుభవించాల్సి వచ్చింది.

పరిచయం నుంచి దుర్వినియోగం వరకు:
ఐఐఎమ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతోన్న యువతి (girl studying in the first year)కి, యువతికి సెకండ్ ఇయర్ చదివే యువకుడితో సోషల్ మీడియా ద్వారా పరిచయం అయింది. ఇద్దరూ తరచుగా చాటింగ్, ఫోన్లు చేసుకునేవారు. గత కొంత కాలంనుంచి ఆ యువతికి తోటి విద్యార్థినితో గొడవలు జరుగుతున్నాయి.
నమ్మకాన్ని వాడుకున్న యువకుడు:
శుక్రవారం రాత్రి యువతి సెకండ్ ఇయర్ యువకుడికి ఫోన్ చేసింది. విషయం చెప్పి ఏం చేయాలో సలహా అడిగింది. ‘ఈ విషయం గురించి చర్చిద్దాం మా హాస్టల్‌కు వచ్చేయ్’అని అన్నాడు. అమె అతడ్ని గుడ్డిగా నమ్మింది. మరో స్నేహితురాలిని వెంట బెట్టుకుని అక్కడికి వెళ్లింది. ఒంటరిగా మాట్లాడదాం అని చెప్పి ఆ యువకుడు ఆమెను తన గదిలోకి తీసుకెళ్లాడు. లోపలికి వెళ్లిన తర్వాత తినడానికి తిండి, తాగడానికి కూల్ డ్రింక్స్ ఇచ్చాడు. అతడు పెట్టిన ఆహారం తినగానే ఆమె స్ప్రహ కోల్పోయింది. తర్వాత అతడు ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. యువతి అతడి బెదిరింపులకు భయపడలేదు. అక్కడినుంచి తప్పించుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పోలీసుల తక్షణ స్పందన:
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు రాత్రి ఐఐఎమ్ హాస్టల్‌లో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. బాధిత యువతికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసులు ఈ కేసును అత్యంత జాగ్రత్తగా పరిశీలిస్తూ విచారణను కొనసాగిస్తున్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Chirag Paswan: కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌కు బాంబు బెదిరింపు!