AP Cabinet meeting on 4th December

రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం

అమరావతి: రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని ఒక రోజు ముందే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 4న ఈ భేటీ జరగాలి. తాజాగా మంగళవారం జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్‌ సమావేశం జరుగుతుందని.. అధికారులు తమ శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి.. జీఏడీకి పంపించాలని ఆదేశించారు.

Advertisements

కాగా, ఈ కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలో తాజా పరిస్థితులు, పేదలకు రేషన్ కార్డులు జారీ, సూపర్ సిక్స్ పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రిమండలి చర్చించనుంది. ఇటీవల సంచలనంగా మారిన అదానీ విద్యుత్ కొనుగోళ్ల లంచం వ్యవహారం, అందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్ర వంటి అంశాలపైనా సుదీర్ఘ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా, నవంబర్ 20న క్యాబినెట్ సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Related Posts
Supriya Sule: విమానయాన సంస్థలకు కఠినమైన నిబంధనలు విధించాలి: సుప్రియా సూలే
Supriya Sule impatience with Air India

Supriya Sule: ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ఎయిర్‌ ఇండియా విమానంపై అసహనం వ్యక్తంచేశారు. తాను ప్రయాణించాల్సిన విమానం కోసం గంటకు పైగా వేచి చూడాల్సి వచ్చిందని Read more

తిరుమలలో ఎంతమంది వైకుంఠద్వార దర్శనాలు చేసుకున్నారంటే..!
tirumala vaikunta ekadasi 2

తిరుమలలో వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా నిర్వహించిన వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. పది రోజుల పాటు సాగిన ఈ Read more

దాడి ఆరోపణలను ఖండించిన కౌశిక్ రెడ్డి
దాడి ఆరోపణలను ఖండించిన కౌశిక్ రెడ్డి

మాజీ కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ పై దాడి చేసినట్లు వచ్చిన ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి Read more

AP;telangana;అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.
అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిస్తే, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది.

తెలంగాణ రాష్ట్రం దేశంలో మద్యం అమ్మకాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది రోజుకు లక్షలాది లీటర్ల మద్యం విక్రయాలు జరుగుతుండగా దక్షిణ భారతదేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ మొదటి స్థానంలో Read more

×