AP: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించిన ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్‌ను (ఏపీడీసీ) ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్‌నెట్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) నుంచి విడదీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటు చేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది.
Advertisements
