Cabinet approves constitution of 8th Pay Commission

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరే శుభవార్త తెలిపింది. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం ముద్ర వేసింది. ఈ మేరకు కేంద్రం మంత్రి అశ్విని వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. 8వ వేతన సంఘం ఏర్పాటు చేసిన తర్వాత తమ తుది నివేదికను 2026లో సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రి వర్గం ఈ మేరకు 8వ పే కమిషన్ ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఈ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి.

Advertisements

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జీతభత్యాలు, కరువు భత్యం, పింఛన్ల వంటివి పే కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని తెలిసిందే. ప్రస్తుంత 7వ వేతన సంఘం అమలులో ఉంది. అయితే ఈ పే కమిషన్ ఏర్పాటై 10 సంవత్సరాలు పూర్తవుతున్న క్రమంలో 8వ వేతన సంఘం ఏర్పాటు చేయాలనే డిమాండ్లు పెరిగాయి. ఉద్యోగ సంఘాలు పలు సందర్భాల్లో కేంద్రానికి వినతులు పంపించారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 1, 2025 రోజున ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్‌లో దీనిపై ప్రకటన ఉంటుందని అంతా భావించారు. కానీ, అంతకున్నా ముందే కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

image
image

8వ వేతన సంఘం అమలైతే ఆ కమిషన్ సిఫార్సుల మేరకు ఉద్యోగుల జీతాలు, పెన్షన్, ఇతర ప్రయోజనాలు భారీగా పెరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, కొన్ని రోజులుగా వేతన సంఘం స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోందన్న వార్తలు సైతం వచ్చాయి. కానీ, వాటన్నింటిని తోసిపుచ్చుతూ 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. 8వ పే కమిషన్ అమలులోకి వస్తే ఉద్యోగుల కనీస వేతనం రూ.34 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనీస పెన్షన్ సైతం రూ.17 వేలపైన అందుతుందని తెలుస్తోంది.

7వ వేతన సంఘం 2016లో అమలులోకి వచ్చింది.పే బ్యాండ్స్, గ్రేడ్ పే వంటి వాటి స్థానంలో సింప్లిఫైడ్ పే మ్యాట్రిక్ అమలులోకి తీసుకొచ్చారు. కనీస వేతనం నెలకు రూ.18 వేలు చేశారు. కేబినెట్ సెక్రటరీ స్థాయికి గరిష్ఠంగా నెలకు రూ. 2.50 లక్షల వేతనం నిర్ణయించారు. బేసిక్ పే పైన 2.57 రెట్లు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఇస్తున్నారు. గ్రాట్యుటీ పరిమితి రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు ఇటీవలే పెంచారు. ఇక ద్రవ్యోల్బణం ఇండెక్స్ ఆధారంగా డీఏ అమలు చేస్తున్నారు. ప్రస్తుతం డీఏ 53 శాతంగా ఉంది.

కాగా, నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం జనవరి 2016లో అమలులోకి తీసుకువచ్చిన 7వ వేతన సంఘం సిఫార్సులు ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనున్నాయి. ఎనిమిదో వేతన సంఘం వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి అమలులోకి రానున్నాయి. వేతన సంఘం సిఫారసుల మేరకు ఉద్యోగులకు వేతనాలు పెరగనున్నాయి. వేతనం సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో త్వరలోనే కమిషన్‌ చైర్మన్‌తో పాటు ఇద్దరు సభ్యులను నియమించనున్నది.

Related Posts
రోడ్డు ప్రమాదాలతో గంటకు ఎంత మంది చనిపోతున్నారో తెలుసా..?
road accidents

దేశంలో రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ విడుదల చేసిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది. 2023లో 4.80 లక్షల రోడ్డు ప్రమాదాల్లో 1.72 లక్షల మంది చనిపోయారని తెలిపింది. Read more

పాఠశాలలకు బాంబు బెదిరింపులు: బీజేపీ vs ఆప్
పాఠశాలలకు బాంబు బెదిరింపులు బీజేపీ vs ఆప్

ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ మంగళవారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పాఠశాల పిల్లలకు బాంబు బెదిరింపులు వచ్చే సమస్యను "రాజకీయం చేస్తోంది" Read more

AP Cabinet : రేపు అమరావతి పనులకు పచ్చ జెండా ఊపనున్న కేబినెట్
AP Cabinet రేపు అమరావతి పనులకు పచ్చ జెండా ఊపనున్న కేబినెట్

AP Cabinet : రేపు అమరావతి పనులకు పచ్చ జెండా ఊపనున్న కేబినెట్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు రాష్ట్ర కేబినెట్ సమావేశం Read more

కులగణన బలహీన వర్గాల ఆకాంక్ష : మంత్రి పొన్నం ప్రభాకర్
Aspiration of Caste Census.. Minister Ponnam Prabhakar

హైదరాబాద్‌: మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో మాట్లాడుతూ.. కులగణన బలహీన వర్గాల ఆకాంక్ష అని తెలిపారు. 1931లో కులగణన చేశారు. 1931 నుంచి ఇప్పటివరకు కులగణన చేయలేదు. Read more

×