ప్రతిష్టాత్మకమైన గేమ్ చేంజర్ మరియు హాస్యభరిత సంక్రాంతికి వస్తున్నాం సినిమాల ద్వారా ఈ సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి నిర్మాత దిల్ రాజు సిద్ధమయ్యారు.జనవరి 10న గేమ్ చేంజర్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా దిల్ రాజు మీడియాతో మాట్లాడారు.గేమ్ చేంజర్ నా కోసం ప్రత్యేకమైన సినిమా. 2020లో మొదలైన ఈ ప్రాజెక్ట్ కోవిడ్ కారణంగా ఆలస్యం అయింది. అయినా శంకర్ గారితో కలిసి ప్రేక్షకులకు గొప్ప అనుభవం అందించాలనే పట్టుదలతో ముందుకెళ్లాం, అని అన్నారు దిల్ రాజు.గేమ్ చేంజర్‌లో రామ్ చరణ్ హీరోగా, ఎస్.జె.సూర్య విలన్‌గా కనిపించనున్నారు. “శంకర్ గారి కధలో కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాకుండా మంచి మెసేజ్ ఉంటుంది.

ఈ సినిమా ప్రేక్షకుల నుంచి విజిల్స్ కొట్టించే సన్నివేశాలను అందిస్తుంది.దాని ఫలితం కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను,” అని దిల్ రాజు అభిప్రాయపడ్డారు.”అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఎఫ్2 ఎలా విజయం సాధించిందో మనకు తెలుసు. అదే ఫార్ములాతో సంక్రాంతికి వస్తున్నాం హిట్ కొట్టడం ఖాయం,”అన్నారు దిల్ రాజు. ఈ సినిమా పల్లెటూరి వాతావరణంలో హాస్యాన్ని జోడించి ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించామని చెప్పారు.పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ, “అయన ప్రయాణం నాకు ఎంతో ప్రేరణ.
రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఆయన చూపిన పట్టుదల నాకు ఓ గేమ్ చేంజర్‌లా ఉంది. ఆయన ఇన్స్పిరేషన్‌తోనే నా సినిమాల మీద కొత్త ఎనర్జీ తెచ్చుకున్నాను,” అన్నారు.ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సినిమాల కోసం టికెట్ రేట్లు పెంచేందుకు, బెనిఫిట్ షోలకు అనుమతులు పొందడానికి చేసిన కృషి గురించి దిల్ రాజు ప్రశంసించారు. “పవన్ కళ్యాణ్ గారు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు,” అని తెలిపారు.”గేమ్ చేంజర్ కోసం సాంగ్స్ దృశ్యాలపై రూ. 75 కోట్ల వ్యయం చేశాం. ప్రతి సన్నివేశం గ్రాండ్‌గా ఉంటుంది. సినిమా 2 గంటల 43 నిమిషాల రన్ టైమ్‌లో దూసుకుపోతుంది.