హెలికాప్టర్ రైడ్ ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
విజయవాడ : విజయవాడలో దసరా పండుగ సందర్భంగా ఉత్సవ్ ఎగ్జిబిషన్ (Utsav Exhibition), హెలికాఫ్టర్ రైడ్ను రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాదొడ్డి ఘనంగా ప్రారంభించారు. అనంతరం హెలికాఫ్టర్లో చక్కర్లు కొట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపి కేశినేని నాని, శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొన్నారు. సొసైటీ ఫర్ వైబ్రెంటర్ విజయవాడ అథ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ వినోదం, విజ్ఞానం, వాణిజ్యం సమ్మిళితమై ఉండి, కుటుంబాలందరికీ వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందించే వేదికగా నిలవనుంది.
మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి (Minister Mandipalli Ramprasad Reddy) మాట్లాడుతూ దసరా పండుగ ధర్మం అధర్మంపై, సత్యం అసత్యంపై సాధించిన విజయవానికి ప్రతీక. ఈ పవిత్ర సందర్భంలో ప్రారంభమైన ఉత్సవ్ ఎగ్జిబిషన్ విజయవాడ ప్రజల ప్రతిభ, వ్యాపారాన్ని సంస్కృతిని దేశానికి చూపించే వేదిక అవుతుందని పేర్కొన్నారు. ఇక విజయవాడ ఉత్సవ్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవం దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తుందని గౌరవ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు (Speaker Chintakayala Ayyanna Patrudu) అన్నారు.
దసరా శోభాయాత్రల నడుమ జరుగుతున్న ఈ వేడుకల్లో
ఆంధ్రప్రదేశ్ టూరిజం (Andhra Pradesh Tourism) అథ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న ఈ మహోత్సవం ప్రపంచంలోనే అతి పెద్ద పండుగ కార్నివల్గా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. స్పీకర్ కార్యాలయంలో శాసనసభ్యులు బోండా ఉమా,గద్దె రామ్మోహన్, బోడె ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిసి,విజయవాడ ఉత్సవానికి ఆహ్వానం అందచేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ సెప్టెంబరు 22 నుండి అక్టోబరు 2 వరకు పున్నమిఘాట్,
తుమ్మలపల్లి కళాక్షేత్రం, ఎంజీ రోడ్, ఘంటశాల సంగీత కళాశాల, విజయవాడ ఎక్స్పో వేదికలపై జరిగే ఈ ఉత్సవం విజయవాడ సాంస్కృతికంగా గౌరవాన్ని మరింతగా పెంచుతుందని తెలిపారు. అమ్మవారి దసరా శోభాయాత్రల నడుమ జరుగుతున్న ఈ వేడుకల్లో భాగంగా ‘ఒక్క నగరం-ఒకే ఉత్సవం’అనే భావనతో నిర్వహణ జరుగుతుందని స్పీకర్ అన్నారు. ఈ ఉత్సవంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. దేవి కనకదుర్గ అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.

బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్ పేరుతో
‘విజయవాడ ఉత్సవ్’ తెచ్చిన శోభతో నగరం ప్రకాశం బ్యారేజీలా తొణికిసలాడుతోంది. ఏ కూడలి చూసినా ‘ఉత్సవ్’ ఉత్సాహమే ఉట్టిపడేలా ప్రభుత్వ యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేసింది. ‘ది వరల్డ్స్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ కార్నివాల్ (‘The World’s Biggest Festive Carnival’) పేరుతో సోమవారం నుంచి అక్టోబరు 2 వరకు సినీ, కళా, సాంస్కృతిక, క్రీడా వైభవాన్ని చాటే ప్రదర్శనలు ప్రజలను అలరించనున్నాయి.
సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ అథ్వర్యంలో పర్యాటకశాఖ (Department of Tourism) సహకారంతో ఈ వేడులకు నిర్వహిస్తున్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి లోకేష్ ముఖ్య అతిథులుగా హాజరై పున్నమి ఘాట్ వేదికపై వేడుకలు ప్రారంభించనున్నారు. గొల్లపూడిలోని ఎక్స్ పో మైదానంలో అమ్యూజిమెంట్ పార్కులు, గ్లోబల్ విలేజ్, ఎక్స్ పో, పుడ్ కోర్టులు, మార్కెట్స్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ప్రముఖ గాయకుల లైవ్ మ్యూజిక్, సినీ వేడుకలు.
పున్నమి ఘాట్ వేదికపై దాండియా నృత్యాలు
తుమ్మలపల్లి కళాక్షేత్రం,మంటశాల సంగీత కళాశాలల్లో, కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు, నాటకాలు, హరికథలు, బుర్రకథలు, తోలు బొమ్మలాటలు కృష్ణా నది పక్కనే ఉన్న పున్నమి ఘాట్ వేదికపై దాండియా నృత్యాలు, లైవ్ బాండ్స్, క్లాసికల్ ఎంటర్టైన్మెంట్, వుడ్ కోర్టులు, లేజర్ షో, వాటర్ స్పోర్ట్స్, డ్రోన్ షో, బాణసంచా ప్రదర్శనలు ఉంటాయి.
ఎస్ అండ్ మిసెస్ క్రౌన్ విజయవాడ, బందరు రోడ్డులో కళాకారులతో మెగటా కార్నివాల్ వాక్, విజయవాడ ఐడల్ షో, సినీ అవార్డులు, సోషల్ మీడియా అవార్డులు, స్వచ్ఛథాన్ పరుగుల వేడుక, సిద్ధార్ధ వైద్య కళాశాల వద్ద హెలికాప్పర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also: