ప్రస్తుతం మొబైల్ లేని వారంటూ ఉండరేమో. ప్రతి ఒక్కరు వాడుతుంటారు. అయితే, చాలా మంది రీఛార్జ్ ధరల (Recharge Prices) భారం పడుతోందని చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఇంటర్నెట్ వినియోగం పెరిగింది. దీంతో వేగవంతమైన నెట్ సేవల ధరలూ పెరిగిపోయాయి. అయితే ఇతర దేశాలతో పోల్చితే రీఛార్జ్ రేట్లు మన దగ్గరే తక్కువ. కానీ ఒకప్పటితో పోల్చితే కనీస రీఛార్జ్ ధరలు (Recharge Prices) భారీగా పెరిగాయని యూజర్లు వాపోతున్నారు.
Read Also: Nirmala Sitharaman: రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన
రీఛార్జ్ ధరలు భారీగా పెరిగాయి
గతంలో రూ.10 రీఛార్జ్ చేసి కాల్స్ మాట్లాడుకునేవాళ్లమని, ఇప్పుడు కనీసం రూ.199 రీఛార్జ్ చేయాల్సి వస్తోందని మండిపడుతున్నారు. టెలికం సంస్థల దోపిడీని కేంద్రం అరికట్టాలని కోరుతున్నారు. కాగా,గత సంవత్సరం రీఛార్జ్ ప్లాన్ల ధరలను జియో,

ఎయిర్‌టెల్ వంటి టెలికాం కంపెనీలు భారీగా పెంచిన సంగతి తెలిసిందే. ట్రాయ్ ప్రకారం, భారత టెలికాం మార్కెట్ వృద్ధి చెందుతోంది. దేశంలో మొత్తం టెలిఫోన్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 123.1 కోట్లకు చేరింది. వీరిలో 118.4 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: