Gold price surge : గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఆల్‌టైమ్ గరిష్ఠ స్థాయిల నుంచి కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు రూ.7 వేల వరకు పతనమయ్యాయి. దీంతో పసిడి కొనుగోలుదారులకు కొంత ఊరట లభించింది. అయితే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వెనెజువెలాపై అమెరికా ఆకస్మికంగా దాడులు చేయడంతో అంతర్జాతీయంగా మళ్లీ అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామాల ప్రభావంతో బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పు కనిపించింది.
అమెరికా వెనెజువెలాపై సైనిక చర్యలు చేపట్టి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించిన విషయం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ చర్యలతో అక్కడ అమెరికా పెట్టుబడులు, పాలన మార్పు వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. ఇటీవల రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ఒక కొలిక్కి వస్తుందన్న అంచనాలతో బంగారం, వెండి ధరలు కొంత తగ్గినా, ఇప్పుడు అమెరికా–వెనెజువెలా ఉద్రిక్తతలతో మళ్లీ భద్రతా ఆస్తుల వైపు పెట్టుబడిదారులు మొగ్గుచూపుతున్నారు.
Read also: Nizamabad Crime: అప్పు ఎగ్గొట్టేందుకు మాస్టర్ ప్లాన్.. అసలేం జరిగింది?
అంతర్జాతీయ మార్కెట్లో కేవలం (Gold price surge) ఆరు గంటల వ్యవధిలోనే బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆదివారం ధరల్లో పెద్ద మార్పులు ఉండకపోయినా, అర్ధరాత్రి తర్వాత ఒక్కసారిగా రేట్లు ఎగబాకాయి. కిందటి రోజు స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు సుమారు 4330 డాలర్ల వద్ద ఉండగా, ఇప్పుడు అది 4410 డాలర్ల స్థాయిని దాటింది. అంటే ఆరు గంటల్లోనే దాదాపు 80 డాలర్లకు పైగా పెరిగింది. అదే సమయంలో వెండి ధర కూడా ఔన్సుకు 72 డాలర్ల నుంచి 76 డాలర్ల స్థాయికి చేరింది.
అంతర్జాతీయ మార్కెట్లలో వచ్చిన ఈ భారీ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్లో సోమవారం ఉదయం నుంచి కనిపించే అవకాశం ఉంది. ప్రస్తుతం మాత్రం దేశీయంగా ధరలు స్థిరంగానే ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం తులం ధర రూ.1,24,500 వద్ద కొనసాగుతోంది. జనవరి 3న ధర తగ్గగా, దానికి ముందు రెండు రోజులు పెరిగింది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,35,820గా ఉంది. వెండి ధర ప్రస్తుతం కిలోకు రూ.2.57 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల రోజుల్లో వెండి ధరలు భారీగా మారుతూ ఉండటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: