భారత జాతీయ చెల్లింపు (Indian National Payment) ల సంస్థ (NPCI) డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని మరింత పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది. సెప్టెంబర్ 15 నుంచి యూపీఐ (UPI) వ్యవస్థలో కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వీటితో వినియోగదారులు పెద్ద మొత్తంలో కూడా సులభంగా లావాదేవీలు చేయగలుగుతున్నారు.ఇప్పటి వరకు అధిక మొత్తాల చెల్లింపుల కోసం వినియోగదారులు చెక్కులు లేదా నెట్ బ్యాంకింగ్‌పై ఆధారపడాల్సి వచ్చేది. కానీ కొత్త నిబంధనలతో ఈ ఇబ్బంది తగ్గనుంది. ధ్రువీకరించిన వ్యాపారులకు రోజుకు రూ.10 లక్షల వరకు చెల్లించవచ్చు. ఇది యూపీఐ వినియోగంలో ఒక విప్లవాత్మక మార్పు.వ్యక్తుల మధ్య నగదు బదిలీ పరిమితి మాత్రం యథాతథంగా ఉంది. రోజుకు రూ.1 లక్ష వరకు మాత్రమే పంపుకోవచ్చు. అంటే, కొత్త పరిమితులు కేవలం నిర్దిష్ట కేటగిరీల వ్యాపార లావాదేవీలకే వర్తిస్తాయి.
బీమా చెల్లింపుల్లో సౌలభ్యం
బీమా రంగంలో యూపీఐ వినియోగం పెరగనుంది. ఒక్కో లావాదేవీకి రూ.2 లక్షల పరిమితిని రూ.5 లక్షలకు పెంచారు. రోజుకు గరిష్టంగా రూ.10 లక్షలు చెల్లించే అవకాశం ఉంది. దీనితో పాలసీ హోల్డర్లకు మరింత సౌకర్యం కలగనుంది.బ్యాంక్ రుణాలు లేదా ఈఎంఐ చెల్లింపులకు కూడా యూపీఐ ద్వారా సౌలభ్యం ఏర్పడింది. ఒక్క లావాదేవీకి రూ.5 లక్షలు, రోజుకు రూ.10 లక్షల వరకు చెల్లించవచ్చు. పెద్ద మొత్తాల ఈఎంఐలు చెల్లించే వారికి ఇది ఒక మంచి నిర్ణయం.
ప్రయాణ ఖర్చుల చెల్లింపులకు కూడా పరిమితి పెరిగింది. ఇప్పటి వరకు రూ.1 లక్ష ఉండగా, ఇప్పుడు రూ.5 లక్షలకు పెరిగింది. రోజుకు గరిష్టంగా రూ.10 లక్షలు వరకు చెల్లించవచ్చు. టూర్ ప్యాకేజీలు బుక్ చేసే వారికి ఇది ప్రయోజనం.
క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు
క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులో యూపీఐ ఉపయోగం మరింత పెరగనుంది. ఒక్క లావాదేవీకి రూ.5 లక్షలు, రోజుకు రూ.6 లక్షలు వరకు చెల్లించవచ్చు. వినియోగదారులు ఇప్పుడు పెద్ద మొత్తాల బిల్లులు కూడా యూపీఐ ద్వారానే క్లియర్ చేయవచ్చు.నగల కొనుగోళ్లకు కూడా సౌకర్యం కల్పించారు. లావాదేవీ పరిమితి రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షలకు పెరిగింది. రోజుకు రూ.6 లక్షల వరకు చెల్లించవచ్చు. నగల వ్యాపారులకు ఇది ఉపయోగకరంగా మారనుంది.
ప్రభుత్వ సేవల్లో పెరిగిన పరిమితులు
GeM పోర్టల్‌లో పన్నులు, డిపాజిట్ల చెల్లింపుల పరిమితి కూడా పెరిగింది. ఇప్పటి వరకు రూ.1 లక్ష ఉండగా, ఇప్పుడు రూ.5 లక్షలకు పెరిగింది. దీంతో ప్రభుత్వ లావాదేవీలు డిజిటల్‌గా మరింత వేగవంతమవుతాయి.డిజిటల్ టర్మ్ డిపాజిట్ల కోసం కూడా పరిమితి పెంచారు. రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం ద్వారా కస్టమర్లకు అదనపు సౌకర్యం కలిగించనున్నారు.ఈ మార్పులు డిజిటల్ లావాదేవీల వినియోగాన్ని మరింత విస్తరించనున్నాయి. బీమా, రుణాలు, ప్రయాణాలు, నగల కొనుగోళ్లు, ప్రభుత్వ సేవలు వంటి విభాగాల్లో యూపీఐ వినియోగం పెరుగుతుందని ఎన్‌సీపీఐ నమ్ముతోంది. కొత్త నిబంధనలతో భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ మరింత బలపడనుంది.
Read Also :