కొత్త ఏడాదిలో TVల ధరలు పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమొరీ చిప్‌ల కొరత, రూపాయి పతనం, దిగుమతి వ్యయాలు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది.దీంతో జనవరిలో 3 నుంచి 10% వరకు టీవీల ధరలు (TV Price) పెరగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సర్వర్ల కోసం హై బ్యాండ్‌విడ్త్ మెమరీ (హెచ్‌బీఎం) చిప్‌లకు భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో చిప్ తయారీ కంపెనీలు అధిక లాభాలు వచ్చే ఏఐ చిప్‌ల ఉత్పత్తికే ప్రాధాన్యం ఇస్తున్నాయి.
Read Also: Nara Brahmani: నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్
రూపాయి విలువ తొలిసారి 90 దాటడం
ఫలితంగా టీవీ (TV Price) ల వంటి పరికరాలకు అవసరమైన చిప్‌ల సరఫరా తగ్గి, వాటి ధరలు విపరీతంగా పెరిగాయి. దీనికి తోడు డాలర్ మారకంలో రూపాయి విలువ తొలిసారి 90 దాటడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఓపెన్‌సెల్, మదర్‌బోర్డు వంటి విడిభాగాల వ్యయం కూడా పెరిగింది. ఈ పరిణామాలతో ఎల్‌ఈడీ టీవీల ధరలు 3 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని హయర్ అప్లయెన్సెస్ ఇండియా ప్రెసిడెంట్ ఎన్‌ఎస్ సతీశ్ తెలిపారు.

అయితే, థామ్సన్, కొడక్ వంటి బ్రాండ్లకు టీవీలు తయారు చేసే సూపర్ ప్లాస్ట్రానిక్స్ సీఈవో అవనీత్ సింగ్ మార్వా మాత్రం ధరల పెంపు 7 నుంచి 10 శాతం వరకు ఉండొచ్చని అంచనా వేశారు. గత మూడేళ్లలో మెమరీ చిప్‌ల ధర ఏకంగా 500 శాతం పెరిగిందని ఆయన గుర్తుచేశారు.
భారతదేశంలో టెలివిజన్ ప్రసారం ఎప్పుడు ప్రారంభమైంది?
భారత్‌లో టెలివిజన్ ప్రసారం 1959లో ప్రారంభమైంది. మొదట ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ఈ సేవలు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: