తెలంగాణ (TG) లో స్టార్టప్‌లను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్టప్ ఎకోసిస్టమ్‌ను వేగంగా అభివృద్ధి చేసి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో రాష్ట్రాన్ని (TG) దేశంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో ముందంజలో నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ₹1000 కోట్ల భారీ ఫండ్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు IT డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్ (Sanjay Kumar) ప్రకటించారు.
Read Also: TG: ఇందిరమ్మ చీరల పంపిణీ పథకం ప్రారంభం

AI స్టార్టప్‌లకు ప్రత్యేక ప్రాధాన్యం
హైదరాబాద్ (Hyderabad) లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన సంజయ్ కుమార్, ఈ ఫండ్‌ను అధికారికంగా వచ్చే జనవరిలో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బూస్ట్ చేసేందుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందన్నారు. AIపై పనిచేసే స్టార్టప్స్‌పై ఫోకస్ చేస్తామని పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: