Vande Bharath: వందే భారత్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుండి ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఈ రైళ్లు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అయితే, వీటిలో ఎప్పుడూ 100 శాతం కంటే ఎక్కువ రద్దీ ఉండటంతో, రైల్వే శాఖ(Railway Department) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రయాణికులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
రైల్వే ప్రయాణానికి దేశవ్యాప్తంగా డిమాండ్ భారీగా ఉంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం వెళ్ళే మార్గం రైళ్లు కావడంతో రోజుకు కోట్లాది మంది ప్రయాణికులు వీటిని ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పండగల సమయంలో టికెట్లు నెలల ముందే బుక్ అయిపోతాయి. ఈ నేపథ్యంలో మరింత సౌకర్యం కల్పించేందుకు రైల్వేలు వందే భారత్ రైళ్లలో కోచ్‌ల సంఖ్యను పెంచాలని నిర్ణయించాయి.

16 బోగీల నుంచి 20 బోగీలకు విస్తరణ
ప్రస్తుతం 16 బోగీలతో నడుస్తున్న మూడు వందే భారత్ రైళ్లను 20 బోగీలుగా విస్తరించనున్నారు. అలాగే 8 బోగీలతో నడుస్తున్న నాలుగు రైళ్లను 16 బోగీలకు పెంచుతారు. ఈ మార్పులతో ఎక్కువ మంది ప్రయాణికులకు సీట్లు లభించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 144 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో సీట్ల డిమాండ్ దాదాపు 100 శాతం కంటే ఎక్కువగానే ఉంది. పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
వందే భారత్ స్లీపర్ కోచ్‌లు రాబోతున్నాయి
త్వరలో వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు(Sleeper coaches) కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 10 స్లీపర్ రైళ్లు తయారీలో ఉన్నాయి. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ 50 వందే భారత్ స్లీపర్ రేక్‌లను తయారు చేస్తోంది. అదనంగా, భవిష్యత్తులో 200 స్లీపర్ బోగీలను కూడా నిర్మించనున్నారు. ఈ కొత్త మార్పులు ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించడమే కాకుండా, రైల్వేల ఆదాయాన్ని కూడా పెంచుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Read also: