Urjit Patel: భారత రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్, ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ ఉర్జిత్ పటేల్ అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక బాధ్యత చేపట్టబోతున్నారు. ఆయనను అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)లో భారత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా(India Executive Director) కేంద్ర ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో ఈ నిర్ణయం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. భారత వాణిని గ్లోబల్ ఫైనాన్షియల్ వేదికలపై మరింత బలంగా వినిపించే అవకాశం ఉన్నదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కేంద్ర ఆమోదం & పదవీకాలం
ఈ నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ (ACC) ఆమోదం తెలిపింది. సిబ్బంది మరియు శిక్షణ విభాగం (DoPT) అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉర్జిత్ పటేల్ ఈ పదవిని మూడేళ్ల కాలానికి చేపట్టనున్నారు. గతంలో కూడా ఆయనకు IMFతో అనుభవం ఉంది. 1992లో న్యూఢిల్లీలో IMF డిప్యూటీ రెసిడెంట్ రిప్రజెంటేటివ్‌గా పని చేశారు. ఆ తరువాత RBIలో డిప్యూటీ గవర్నర్‌గా సేవలందించి, 2016లో 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన నాయకత్వంలో ద్రవ్య విధానం, ఆర్థిక పరిశోధన, గణాంకాలు, సమాచార నిర్వహణ వంటి ప్రధాన విభాగాలు పర్యవేక్షించబడ్డాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ లక్ష్య విధానానికి (Inflation Targeting Policy) రూపకల్పనలో ఆయన కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా, ఆయన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు కన్సల్టెంట్‌గా పనిచేశారు. ప్రభుత్వ పదవులతో పాటు రిలయన్స్ ఇండస్ట్రీస్, IDFC, MCX వంటి ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉన్నత స్థానాల్లో సేవలందించారు. విద్యార్హతల విషయానికి వస్తే, యేల్ యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ మరియు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పట్టాలు పొందారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: