Nepal Govt: నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్ వంటి 26 ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా నమోదు చేసుకోకపోవడమే ఈ నిషేధానికి(to ban) ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ మేరకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆయా సైట్ల సేవలను నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చర్యలు

నేపాల్ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, దేశంలో పనిచేసే అన్ని సోషల్ మీడియా సంస్థలు ప్రభుత్వ అధికారుల వద్ద తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి, మరియు అభ్యంతరకరమైనకంటెంట్‌ను పర్యవేక్షించాలి. ఈ ఆదేశాలను అమలు చేయడానికి ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలకు ఏడు రోజుల గడువు ఇచ్చింది. కానీ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్, రెడ్డిట్ వంటి 26 ప్రధాన కంపెనీలు గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. దీంతో నేపాల్ (Nepal) టెలికమ్యూనికేషన్ అథారిటీకి వాటిపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇది తాత్కాలిక నిషేధమని, కంపెనీలు రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన వెంటనే సేవలను తిరిగి పునరుద్ధరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అనుచిత కంటెంట్‌ను నియంత్రించి, దేశంలో సామాజిక సామరస్యాన్ని కాపాడటమే తమ లక్ష్యమని పేర్కొంది. నేపాల్ ప్రభుత్వం గతంలోనూ 2023లో టిక్‌టాక్‌పై కూడా ఇలాంటి నిషేధాన్ని విధించింది.
సోషల్ మీడియా సైట్లపై నిషేధానికి కారణం ఏమిటి?
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం ప్రధాన కారణం.
ఏయే ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించారు?
ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్‌తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై ఈ నిషేధం అమలవుతుంది
Read hindi news : hindi.vaartha.com
Read also :
: