Landslide: ఇటీవల బంగాళాఖాతంలో తరచూ ఏర్పడుతున్న వాయుగుండంతో తుఫానులు వస్తున్నాయి. ఎడతెరపీ లేకుండా కురుస్తున్న వర్షాలతో పలురాష్ట్రాలలో వరదలు ముచ్చెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్ అనగానే మంచుకొండలు,(Icebergs) పచ్చని ప్రకృతితో కనువిందు చేసే దృశ్యాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండడంతో ఉత్తరాఖండ్ పరిస్థితి హృదయవిదారకంగా మారింది. నెలరోజుల క్రితం ఉత్తరకాశీలో క్లౌడ్ బరస్ట్ గ్రామం గ్రామమే తుడిచిపెట్టుకుని పోయింది. అనేకులు గల్లంతు అయ్యారు. మళ్లీ ఎడతెరపీ లేకుండా వర్షాలు పడుతుండడంతో ఎటు చూసినా మట్టి దిబ్బలు, వరద బురదతో సుందరనగరం ఆనవాళ్లు లేకుండా పోయింది.

ఇద్దరు యాత్రికులు మృతి
సోమవారం ఉత్తరాఖండ్ లో భారీ వర్షాల మధ్య కేదార్నాథ్(Kedarnath) సమీపంలో ఒక వాహనంపై కొండచరియలు విరిగిపడడంతో ఇద్దరు యాత్రికులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. నిత్యం వర్షం కురుస్తుండడంతో హేమకుండ్ సాహిబ్, చార్ధామ్ యాత్రను సెప్టెంబరు 5వరకు వాయి వేశారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్డ్’ జారీ చేసింది. కేదార్నాథ్ జాతీయ రహదారిపై సోన్ ప్రయాగ్, గౌరీకుండ్ మధ్య ముంకటియా సమీపంలో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని రుద్రప్రయాగ్ జిల్లా విపత్తు నిర్వహణ అధికారి నందన్ సింగ్ రాజవర్ తెలిపారు. ఆప్రమాదం అటుగా వెళుతున్న వాహనం కొండపై నుండి అకస్మాత్తుగా పడిపోయిన శిథిలాలు, రాళ్లను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళతో సహా ఇద్దరు భక్తులు అక్కడిక్కడే మరణించారని, మరో ఆరుగురు గాయపడ్డారని ఆయన చెప్పారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అన్నారు.
హెచ్చరికలు జారీ
కాగా రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద, మందాకిని నదుల స్థాయి హెచ్చరిక స్థాయిని దాటింది. నది ఒడ్డున వెళ్లవద్దని లౌడ్ స్పీకర్ల ద్వారా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. రుద్రప్రయాగ్ జిల్లాలోని అలకనంద, మందానికి నదుల ఒడ్డున ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఈరోజు మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.
చార్‌ధామ్ యాత్ర ఎందుకు నిలిపివేశారు?
ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు, వరదలు, మరియు కొండచరియలు విరిగిపడటంతో యాత్రికుల భద్రత కోసం యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
యాత్ర తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుంది?
వాతావరణ పరిస్థితులు మెరుగుపడిన తర్వాత యాత్రను తిరిగి ప్రారంభిస్తారు. దీనిపై అధికారులు ఎప్పటికప్పుడు ప్రకటనలు జారీ చేస్తారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :