हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

TCS: టిసిఎస్ కొత్త విధానం.. ‘పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు’

Shobha Rani
TCS: టిసిఎస్ కొత్త విధానం.. ‘పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు’

ది రిసోర్స్ మెనేజ్ మెంట్ గ్రూప్ (ఆర్ఎంజీ) గ్లోబల్ హెడ్ చంద్రశేఖరన్ రామ్ కుమార్ ఈ కొత్త పని విధానాన్ని రూపొందించారు. టీసీఎస్ (TCS) లోని శ్రామిక శక్తి విస్తరణను ఆర్ఎంజీ పర్యవేక్షిస్తుంది. ప్రతి ప్రాజెక్టుకు ప్రతిభ కలిగిన వారిని కేటాయించేలా చూస్తుంది. ఉద్యోగులందరికీ అన్ని సమయాల్లో ప్రాజెక్టులు కేటాయిస్తుంది. కొత్త విధానం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని ఆ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ఉద్యోగులు ఎక్కువ కాలం బెంచ్ లో ఉంటే జీతం, కెరీర్ గ్రోత్, విదేశీ అవకాశాలు తదితర వాటిపై ప్రతి కూల ప్రభావం పడుతుందన్నారు.
ప్రాజెక్ట్ లేని ఉద్యోగులకు చర్యలు
కొత్త నిబంధనల ప్రకారం ప్రాజెక్టు లేని ఉద్యోగులు తమకు తాముగా పని వెతుక్కోవాలి. అంటే బెంచ్ లో ఉన్న ఉద్యోగి తమ యూనిట్ లేదా, రీజినల్ ఆర్ఎంజీని సంప్రదించాలి. సంస్థ అందించే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. తద్వారా తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు చర్యలు తీసుకోవాలి. బెంచ్ లో ఉండే ఉద్యోగులు రోజుకు 4 నుంచి 6 గంటల పాటు టీసీఎస్ (TCS)ఐఇవాల్వ్ (iEvolve), ఫ్రోస్కో ప్లే (Fresco play), వీఎల్ఎస్ వంటి అంతర్గత ప్లాట్ ఫాంలతో పాటు, లింక్డ్ ఇన్ వంటి బయట వాటిని నేర్చుకోవాలి. ఆర్ఎంజీ సిఫారసు చేసిన విధంగా వ్యక్తిగత సెషన్లకు హాజరుకావాలి.

TCS: టిసిఎస్ కొత్త విధానం.. 'పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు'
TCS: టిసిఎస్ కొత్త విధానం.. ‘పని చేస్తే సరే.. ఖాళీగా ఉంటే కుదరదు’

పనిచేసే విధానం – కార్యాలయం నుంచి తప్పనిసరి
టీసీఎస్ (TCS)లో పనిచేసే ఉద్యోగులందరూ తప్పనిసరిగా ఆఫీసుకు రావాలని నిబంధనలు చెబుతున్నాయి. వారందరూ ఆఫీసు నుంచి పని చేయాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రం హోమ్, ఫ్లెక్సిబుల్ పని ఏర్పాట్లకు అనుమతి ఇవ్వరు. అయితే అత్యవసర సమయలో ఆర్ఎంజీ అనుమతితో తాత్కాలికంగా ఫ్లెక్సిబుల్ పని చేసేలా అవకాశం కల్పిస్తారు. అలాగే ఉద్యోగులు షార్ట్ టర్మ్ ప్రాజెక్టులో ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. తరచూ ఇలాంటి వాటిలో పనిచేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.
షార్ట్ టర్మ్ ప్రాజెక్టులపై పరిమితులు
తరచుగా చిన్న ప్రాజెక్టుల్లో ఉండరాదు. ఇలా జరగడం కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తీసుకోబడే అవకాశం ఉంటుంది.TCS కొత్త విధానం ఉద్యోగులంతా చిరకాలంగా ప్రాజెక్టుల్లో భాగమై ఉండాలని, తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని, మరియు సంస్థకు విలువ చేకూర్చేలా ఉండాలని ప్రోత్సహిస్తుంది. ఇది ఉద్యోగి మరియు సంస్థ ఇద్దరికీ లాభదాయకం అవుతుంది.

Read Also: Stock market: స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870