కేటీఎం మరోసారి తమ పవర్‌ప్యాక్‌డ్ బైకులతో బైక్ ప్రేమికులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో మంచి స్పందన పొందిన 1390 సూపర్ డ్యూక్ R తర్వాత… ఇప్పుడు దాని మరింత తేలికైన, ప్రీమియం ఫీచర్లతో కూడిన 1390 సూపర్ డ్యూక్ RR లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసేందుకు కేటీఎం రెడీ అవుతోంది. యూరోపియన్ హోమోలగేషన్ డాక్యుమెంట్ల ద్వారా ఈ కొత్త మోడల్ వివరాలు బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా, బరువు తగ్గించడం, హ్యాండ్లింగ్ మెరుగుపరచడం, ప్రీమియం సస్పెన్షన్ వంటి అప్‌గ్రేడ్లు ఇందులో హైలైట్‌గా నిలిచేలా కనిపిస్తున్నాయి.
Read also: GCCs: హైదరాబాద్‌నే దిగ్గజ కంపెనీలన్నీ ఎందుకు ఎంచుకుంటున్నాయి?

KTM, Super Duke, bike lovers, new bike launch,
కొత్త మోడల్‌లో ఏముంది?
- స్టాండర్డ్ 1390 సూపర్ డ్యూక్ R బరువు 467 పౌండ్లు, RR వేరియంట్ బరువు మాత్రం 450 పౌండ్లు మాత్రమే
- ఇంజిన్ పవర్‌లో ఎలాంటి మార్పు లేదు
- 1350cc V-ట్విన్ ఇంజిన్ –
• 10,000 RPM వద్ద 188 HP
• 8,000 RPM వద్ద 107 lb-ft టార్క్ - అక్రపోవిక్ టైటానియం మఫ్లర్
- 17 మిల్లీమీటర్లు వెడల్పైన కొత్త హ్యాండిల్‌బార్
- WP Apex Pro సస్పెన్షన్ అమర్చే అవకాశం
- స్టాండర్డ్ మోడల్ కంటే ధర ఎక్కువగా ఉండే అవకాశం
- విడుదల తేదీపై కంపెనీ నుంచి ఇంకా అధికారిక ప్రకటన లేదు
ముందుగా ఈ బైక్‌ను EICMA 2025లో ఆవిష్కరించాలనుకున్నారు. అయితే కొంత ఆర్థిక మార్పులు, పెట్టుబడి ప్రణాళికల నేపథ్యంలో షెడ్యూల్ మార్చినట్లు తెలుస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: